వ్రరత్నాకరము
36 వ్రరత్నాకరము కష్టపడుచున్నాను. తుదిలేని యట్టి యీ దుఃఖసముద్రమునుండి విడుదలచెందు సుపాయమొక్కటి చెప్పవలయునని ప్రార్ధింపఁగా శ్రీకృష్ణుఁడు ధర్మ రాజుతో ని ట్లనియె. “ఓధర్మనందనా! అనంతవ్రత మనువ్రత మొకటిగలదు. అయ్యది సకలపాపంబులను బోఁగొట్టి స్త్రీపురుషులకుఁ గోర్కుల నన్ని టి నొసఁగునది. శాశ్వతకీర్తిని, శాశ్వతసంపదను, పెక్కండ్రు. పుత్రపౌత్రులను అన్నియక్షులను నొసంగునట్టిది. ఆ వ్రత మును భాద్రపదమాసంబున శుక్ల పక్ష చతుర్దశినాఁ డాచరింప వలయును. ఆవ్రతము నాచరించుటచే మానవులకు సకలపాపం బులు తోలఁగును.” అని శ్రీకృష్ణుఁడు చెప్పగా, ధర్మరాజు కృష్ణుని జూచి, "ఓ కేశవా ! నీవు అనంతుఁడని చెప్పితివిక, ఆయనంతుఁ డెవ్వఁడు? ఆది శేషుఁడా! తక్షకుఁడా! పరమాత్మయా ! లేక బ్రహ్మదేవుఁడా! ఈయనంతుఁ డనువాఁ డెవ్వఁడు; నాకు వా స్త వము నెఱిఁగింపుము" అని యడుగఁగా, శ్రీకృష్ణుఁడు వెండియు. నతనితో ని ట్లనియె. ఓకుంతీపుత్రుఁ డా! `నేనే యాయనంతుఁడను. 'నేనే విశ్వ రూపుఁడ నని నీకుఁ దెలియునుగదా. సూర్యునిసంచారముచే కళ, కాష్ఠ, ముహూర్తము, పగలు, రాత్రి, పక్షము, నెల, ఋతువు, అయనము, సంవత్సరము అనుభేదములు గల యేకా లము ఏర్పడుచున్నదో అది 'నేనే. ఆక్టియనంతుఁడ నైన 'నేను సకలరాక్షసులను సంహరించి భూభారము తగ్గించుటకై భూలోకంబున వసుదేవునికులంబునఁ బుట్టితిని. నేనే అనంతుఁ