పుట:వెలుగోటివారి వంశావళి.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

81


సీ.

మెఱయు రాహుత్తుల మెదడు గందపుఁబూఁత
        మత్తారిరాజచర్మంబు కాసె
సమదారిమాంసఖండములు పువ్వులదండ[1]
        విమతభూపతి జడ వీరగోల
ఘనరక్తభీకరాకార మావేశంబు[2]
        బెడిదంపుదాఁటులు పెద్దసివము
సాహసాటోపనిర్హాదంబు బొబ్బలు
        మెఱుఁగైన చాయలు మిట్టగుడ్లు[3]
కదనమున మన్నెపోతుల గావుపట్టి[4]
పోరఁ జరియించు నీఖడ్గపోతురాజు[5]
గాయగోవాళ బల్లరగండబిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

235


సీ.

పొలుపొందు తలకాయపూజె కుండలు[6] సూచి
        ప్రథిత విద్వేషుల[7] ప్రభలు సూచి
కర మరిఖడ్గాళి కడిఁదియేటులు[8] సూచి
        నెఱపైన[9] రణరంగవేది సూచి
మేలిమి నెసఁగిన[10] మెదడు గందము సూచి
        శత్రురక్తంపుటక్షతలు[11] సూచి
భీకరజయఘోష పెండ్లికూఁతురుఁ జూచి
        పెంపొందు మత్తారిపీఁటఁ జూచి

  1. V.V.C. p 85, A. సముదారిమోమున ఖండములవూలదండ
    B. సముదారిమాముని ఖండములపూలదండ
  2. A.B. కారమాకారంబు
  3. A.B. సంహారంబు....మిట్టగుండ్లు
  4. B. గామబట్టి
  5. V.V.C. p. 85, A.B. నహితురాజు
  6. A.B. భూబిగుండలు
  7. A.B. విద్వేషత
  8. A. ఖడ్గ్యాదికత్తియెత్తులు; B. ఖడ్గాదికత్తియేతలు
  9. A.B. వెడువైన
  10. A.B. నొసగిన
  11. A.B. యతుల రక్తప్రదక్షతలు