పుట:వెలుగోటివారి వంశావళి.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

వెలుగోటివారి వంశావళి


మురియ[1] భిక్షావృత్తి ముక్తిశాంతయలింగ
        జననాథుఁ గొట్టవె జగ మెఱుంగ
నాలంబులోనఁ జేఁబ్రోలితిమ్మయఁ జంపి
        పంపవె దేవేంద్రుపట్టణమున
కెన్నఁ[2] జిత్రంబు లిటువంటి వెన్ని లేవు
ప్రజ్ఞతో నీవు సేసిన పౌరుషములు
గాయగోవాళ బల్లరగండ బిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

233


సీ.

ఎసరేఁగి[3] రిపుల భూ మేలనీయవుగాని[4]
        యింద్రుపట్టణము వారింపలేవు[5]
ఒదిఁగి రాజుల నీడ నుండనీయవుగాని
        మందారముల[6]నీడ మాన్పలేవు
సింహాసనము వైరిఁ జేరనీయవుగాని
        చింతామణుల గద్దె[7] జెఱుపలేవు
అరుల నెచ్చెలులఁ గూడాడ[8]నీయవుగాని
        యల రంభతోడిపొం దాఁప[9]లేవు
ఇడుమలకు మాఱు సంపద లినుమడయ్యెె
నీడ వలదన్న స్వర్గాని కేగవలసె[10]
గాయగోవాళ గండరగండబిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

234
  1. A.B. మెరశి
  2. A.B. అన్న
  3. A.B. ఎనరేగి
  4. A.B. నీయడు. The next three lines end similarly.
  5. A.B. వేరింపలేదు
  6. A.B. మందానిలము
  7. A. గంద. B. గందె
  8. A. అరులనిచ్చెరులగూడెడ; B. అరులనిచ్చెలులగూడెడ
  9. A. అనువలేదు
  10. A. యిదుగొవారికి మప్పుదొగియనుమదయ్యె
    యీడ వలనైన స్వర్గానికేడవలను
    B. యిదుగోవారికి పువ్వుదొగియనుమదయ్యె