పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ ... 61 669 .

(ఎ) ఉన్నత న్యాయస్థానములో న్యాయాధీశునిగా
   :ఉండిన ఒక వ్యక్తిని                .... 'చైర్-పర్సన్;  
(బి) సంబంధిత రాజ్య ప్రధాన కార్యదర్శి ..... సభ్యుడు;
(సి) ప్రాధికార సంస్థ యొక్క చైర్ పర్సన్ లేదా.
   :కేంద్ర కమీషను యొక్క ఛైర్-పర్సన్ . . ..   సభ్యుడు: 

అయితే, ఈ పరిచ్ఛేదములో నున్నదేదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా, పనిచేయు లేక చేసి చైర్ పర్సన్ గా నున్న వ్యక్తి నియామకమునకు వర్తించదు.

(2) రాజ్య ప్రభుత్వము, చైర్ పర్సన్ లేక ఒక సభ్యుని మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా ఏదేని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసము లోపు మరియు చైర్ పర్సన్ లేక సభ్యుడి పదవీ విరమణ లేక పదని కాలావధి ముగింపుకు పూర్వపు ఆరు మాసములలో, ఖాళీని భర్తీ చేయుటకు ఎంపిక కమిటీకి నిర్దేశించవలెను.

(3) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించబడిన తేదీ నుండి మూడు మాసముల లోపు ఛైర్ పర్సన్ మరియు సభ్యుల ఎంపికను పూర్తి చేయవలెను.

(4) ఎంపిక కమిటీ, తనకు నిర్దేశించిన ప్రతి ఖాళీ కొరకు ఇద్దరి పేర్లు గల ప్యానలును సిఫారసు చేయవలెను.

(5) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఇతర సభ్యునిగా నియామకము కొరకు ఎవరేని వ్యక్తిని సిఫారసు చేయుటకు పూర్వము ఎంపిక కమిటీ, అట్టి ఛైర్ పర్సన్ లేక సందర్భానుసారము సభ్యుడు అతని కృత్యములకు భంగము వాటిల్లగల ఏదేని విత్తీయ లేక ఇతర హితము లేనట్టి వ్యక్తి యైనట్లు తాను సంతృప్తి పొందవలెను.

(6) చైర్ పర్సన్ లేక ఇతర సభ్యుల నియామకమేదియు ఎంపిక కమిటీలో ఏదేని ఖాళీ ఏర్పడిన కారణము మాత్రముననే శాసనమాన్యత కోల్పోరాదు.

86.(1) రాజ్య కమీషను, ఈ క్రింది కృత్యములను నిర్వర్తించవలెను, ఆవేవనగా

(ఎ) రాజ్యము లోపల టోకు లేదా సందర్భానుసారము పెద్ద లేక చిల్లరగా విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదన, సరఫరా, ప్రసారము మరియు వినియమము కొరకు టారిఫ్ ను నిర్ధారించుట:

అయితే, 42వ పరిచ్ఛేదము క్రింద వినియోగదారుల శ్రేణికి ప్రవేశ సౌలభ్యమును అనుమతించినపుడు, రాజ్య కమీషను, సదరు వినియోగ దారుల శ్రేణి కొరకు, వీలింగు ఛార్జీలు మరియు సర్ ఛార్జీలు ఏవేని ఉన్నచో, వాటిని మాత్రమే నిర్ధారించవలెను.