పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

391 G39... (5), ప్రతియొక పంపిణీ లైసెన్సుదారు, నియత తేదీ లేదా లైసెన్సు మంజూరైన తేదీ, ఇందులో ఏది ముందు జరుగునో అప్పటి నుండి ఆరుమాసముల లోపల రాజ్య కమీషను చే నిర్దిష్టపరచబడు నట్టి మార్గదర్శకములననుసరించి వినియోగదారుల వ్యధల నివారణ కొరకు వేదిక నొకదానిని స్థాపించవలెను.

(6) "ఉప-పరిచ్చేదము (5) క్రింద తన వ్యధల నివారణ లభించని కారణముగా వ్యధితుడైన ఎవరేని వినియోగదారుడు, రాజ్య కమీషనుచే నియమించబడి లేక హోదా కల్పించబడి అంబడ్స్ మన్ గా పిలువబడు ప్రాధికారికి తన వ్యధల నివారణ కొరకు విన్నపము చేసుకొనవచ్చును.

(7) అంబడ్స్ మన్, రాజ్య కమీషను చే నిర్దిష్ట పరచబడినట్టి సమయము లోపల మరియు అట్టి రీతిలో వినియోగదారుని వ్యధను పరిష్కరించవలెను.

(8) ఉష పరిచ్చేదము (5), (6) మరియు (7)లలో ఉన్న నిబంధనలు, ఆ ఉప పరిచ్ఛేదముల ద్వారా అతడికి ఒసగబడిన హక్కుతో పాటు విడిగా వినియోగదారుడు కలిగి ఉండునట్టి హక్కులకు భంగము కలుగకుండా ఉండవలెను.

43.(1) ఈ చట్టములో ఇతర విధంగా నిబంధిచిననే తప్ప, ప్రతియొక పంపిణీ లైసెన్సుదారు ఏవేని ఆవరణల స్వంతదారు లేదా ఆక్రమణదారుని దరఖాస్తు పై అట్టి, సరఫరాను కోరుతూ చేసిన దరఖాస్తును స్వీకరించిన తరువాత ఒక మాసము లోపల అట్టి ఆవరణములకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయవలెను:

అయితే, అట్టి సరఫరాకు పంపిణీ, మేయిన్ల విస్తరణ లేక క్రొత్త సబ్ స్టేషన్ల ప్రారంభము చేయుట అవసరమైన యెడల, పంపిణీ లైసెన్సుదారు, అట్టి విస్తరణ లేదా ప్రారంభము చేసిన తరువాత లేక సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి కాలావధి లోపల అట్టి ఆవరణము లకు వెంటనే విద్యుచ్ఛక్తి సరఫరా చేయవలెను.

అంతేకాక, విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు సదుపాయము ఏదియు లేని గ్రామము లేక పల్లె లేక ప్రాంతము విషయములో సముచిత కమీషను, అట్టి గ్రామము లేక పల్లె లేక ప్రాంతము విద్యుద్దీకరణ కొరకు అది అవసరమని భావించినచో సదరు. కాలావధిని పొడిగించ వచ్చును.

“విశదీకరణ: - ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తము "దరఖాస్తు" అనగా అవసరమైన ఛార్జీల చెల్లింపును మరియు ఇతర అనువర్తనములను చూపు దస్తావేజులతో సహా పంపిణీ లైసెన్సుదారులకు అవసరమైనట్టి సముచిత ప్రరూపములో అన్ని విషయాలను తెలియజేస్తూ పూర్తి చేసిన దరఖాస్తు అని అర్ధము. "