పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

38/G38 - మరియు వీలింగు ఛార్జీలను నిర్ధారించుటలో సదరు ఎదురు సబ్సిడీలు మరియు ఇతర నిర్వహణపరమైన నిరోధములతో సహా సంబంధిత అంశములన్నింటిని పరిగణనలోనికి తీసుకొనవలెను:

అయితే, అట్టి ప్రవేశ సౌలభ్యమును రాజ్య కమీషనుచే నిర్ధారించబడునట్టి వీలింగు ఛార్జీలకు అదనముగా సర్ ఛార్జీ చెల్లింపుపై అనుమతించ వలెను:

అంతేకాక, అట్టి సర్-ఛార్జిని, పంపిణీ లైసెన్సుదారు సరఫరా ప్రాంతము. లోపల ప్రస్తుత స్థాయి ఎదురు సబ్సిడీ అవసరములను భరించు నిమిత్తము వినియోగించవలెను.

అంతేకాక, అట్టి సర్-ఛార్జీ మరియు ఎదురు సబ్సిడీలను రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచ బడునట్టి రీతిలో కూడా క్రమముగా తగ్గించవలెను.

అంతేకాక, తన స్వంత వినియోగ గమ్యస్థానమునకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసికొనుటకు క్యాప్టివ్ ఉత్పాదన ప్లాంటును స్థాపించుకున్నట్టి వ్యక్తికి ప్రవేశసౌలభ్యము సమకూర్చబడిన సందర్భములో అట్టి సర్ చార్టీ విధించబడరాదు.

అంతేకాక, విద్యుచ్ఛక్తి (సవరణ) చట్టము, 2003 ప్రారంభ తేదీ నుండి ఐదు సంవత్సరములకు తక్కువ కాకుండా వినియమముల ద్వారా ఏదేని సమయములో లభించిన గరిష్ట విద్యుచ్ఛక్తి ఒక మెగా వాట్ కు మించినపుడు, విద్యుచ్ఛక్తి అవసరమైనట్టి వినియోగదారులందరికి అట్టి ప్రవేశ సౌలభ్యమును రాజ్య కమీషను నిబంధించవలేను.

(3) ఏ వ్యక్తి యొక్క ఆవరణలు పంపిణీ లైసెన్సుదారు సరఫరా ప్రాంతములో ఉన్నాయో (నియత తేదీకి ముందు విద్యుచ్ఛక్తి పంపిణీ వ్యాపారములో నిమగ్నమైన స్థానిక ప్రాధికార సంస్థ కానట్టి) ఆ వ్యక్తికి ఉత్పాదన కంపెనీ లేక అట్టి పంపిణీ లైసెన్సుదారు కానట్టి ఎవరేని లైసెన్సుదారు నుండి విద్యుచ్ఛక్తి సరఫరా అవసరమైన యెడల, అట్టి వ్యక్తి, నోటీసు ద్వారా రాజ్య కమీషనుచే చేయబడిన వినియమముల ననుసరించి అట్టి విద్యుచ్ఛక్తి వీలింగు కొరకు పంపిణీ లైసెన్సుదారును కోరవచ్చును మరియు అట్టి సరఫరాకు సంబంధించి పంపిణీ లైసెన్సుదారుని కర్తవ్యములు, విచక్షణారహితమైన ప్రవేశ సౌలభ్యము సమకూర్చు సామన్య వాహక సంస్థ వలె ఉండవలెను.

(4) తమ సరఫరా ప్రాంతపు పంపిణీ లైసెన్సుదారు. కానట్టి, ఒకవ్యక్తి నుండి విద్యుచ్ఛక్తి సరఫరా పొందుటకు ఒక వినియోగదారుడికి లేదా వినియోగదారుల తరగతికి రాజ్య కమీషను అనుమతించునెడల, అట్టి వినియోగదారుడు, సరఫరా చేయుట కొరకైన అతడి బాధ్యత నుండి ఉత్పన్నమైనట్టి పంపిణీ లైసెన్సుదారుని నిర్ణీత ఖర్చును భరించుటకు రాజ్య కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి వీలింగు ఛార్జీల పై అదనపు సర్-ఛార్జిని చెల్లించుటకు ఆ పాత్రుడగును.