పుట:విక్రమార్కచరిత్రము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


తే.

గమనములఁ జాల నలసత గానఁబడఁగ
నెమ్మనంబులు మృత్సౌరభమ్ము గోర
మిగులవ్రేఁకని తొడవులమెచ్చు సడల
గర్భసంపద నొప్పి రక్కమలముఖులు.

166


సీ.

వేదవేదాంగాదివిద్యలు శీలింప
        శీలవతీకాంత చింతసేయు
ధరణి నేశాతపత్రముగ నేలుకొనంగ
        సతతంబు రాగమంజరి తలంచు
రాజరంజనరీతి రసికతామహిమల
        సుమతియై వెలుఁగంగ సుమతి గోరు
సగుణనిర్గుణములసంబోధనాపేక్ష
        మదిలోన భావించు మదనరేఖ


తే.

యాత్మగర్భాంతరాళంబులందు నున్న
యర్భకులయందు నందమై యతిశయిల్లు
గుణము లన్నియు నిచ్చానుగుణము లగుచు
నాఁటినాఁటికి దమయందు నాటుకొనఁగ.

167


చ.

లలితకపోలమండలములన్ మణికుండలముల్ నటింప, వి
చ్చలవిడిగా వినూత్నపురుషాయితకేలికి నగ్గలించు న
గ్గలికలు చెల్లకున్న, నధికవ్యథ నొయ్యన మాటిమాటి కూ
ర్పులు నిగిడింపఁ జొచ్చిరి సరోరుహనేత్రలు గర్భభిన్నతన్.

168


చ.

కనుఁగొని, నెమ్మనం బలరఁగాఁ బులిజున్నును నేదుకన్ను దె
మ్మనినను దెచ్చువాఁడఁ, బ్రియ మైనవి యెల్లను జెప్పుఁడంచు [1]గొ
బ్బన హృదయానువర్తి యయి, పల్కును బంతము నొక్కభంగి గాఁ
దనియఁగ నిచ్చు నవ్విభుఁడు తామరసాదులు గోరుకోరికల్.

169
  1. గొ, బ్బున హృదయానువర్తి యయి పల్కును, వావిళ్ల. 1928. యతి(?)