పుట:విక్రమార్కచరిత్రము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

విక్రమార్క చరిత్రము


జేయఁగ నాత్మఁ గోరి సరసీరుహగర్భుఁడు పుట్టె భట్టియై;
పాయక జోడుగూడి యిలఁ బాలన సేయుట మీకు నైజమౌ.

64


చ.

వదలక మీచరిత్రములు వర్ణనచేసిన, సంస్మరించినం,
జదివిన, వ్రాసినన్, విని ప్రసంగవశంబునఁ బేరుకొన్నఁ బె
ల్లొదవు మనుష్యకోటికి సముజ్జ్వలరాజ్యరమాసమృద్ధియున్,
సదమలధర్మబుద్ధియును సంవిదుదంచితమోక్షసిద్ధియున్.

65


మ.

అని, సర్వేశ్వరి యానతిచ్చినఁ బ్రియం బారంగ సాష్టాంగదం
డనమస్కారముఖోపచారములు నానాభంగులం జేసి, య
జ్జననాథాన్వయచక్రవర్తి తదనుజ్ఞాసిద్ధిపూర్వంబుగాఁ
దనయిచ్చం జరియించుచుండె నికటోద్యానాంతరాళంబునన్.

66


విక్రమార్కుఁ డుజ్జయినికి రాజగుట

ఉ.

అట్టి యెడన్, బ్రసేనుఁ డనునప్పుర మేలెడు రాజు చన్న, నా
పట్టపుదంతి మంత్రులయుపాయమునం జనుదెంచి, కీర్తికిం
గట్టనుఁగైన హారలతఁ గంఠమునం దిడ; రాజ్యలక్ష్మికిం
బట్టము గట్టి రాప్తులును బంధులు భృత్యులు నన్నరేంద్రునిన్.

67


వ.

ఇత్తెఱంగున నుజ్జయినీరాజ్యసింహాసనాసీనుండై.

68


సీ.

భరతునిలాగునఁ బరశురామునిభాతి
        రంతిదేవునిభంగి రాముగరిమ
[1]నంగునిరేఖ యయాతిభావంబునఁ
        బృథువిధంబున భగీరథునిమాడ్కి
గయులీల మాంధాతకైవడి నంబరీ
        షునిరీతి శశిబిందుసోయగమున
శిబిపోలిక మరుత్తుచెల్వునను దిలీపు
        కరణి సుహోత్రునిగారవమున

  1. ఒక రాజు, కాంచనాలంకారములతోఁ గూడిన గజాదులను దానము చేసి, యర్థులకు బంగార మొసఁగి యనేకయాగము లొనరించెను. దైవబ్రాహ్మణభక్తినిరతుఁడు.