పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

వాసిష్ఠరామాయణము

     శ్రాంతోదాత్త నిజప్రభావ యఘపారావారసంశోషణా
     చింతాతంతులతాలవిత్ర వరదా శ్రీసంశ్రితోరఃస్థలా.302
క. అంభోదనాదవిలస
     ద్గంభీరమహాట్టహాస కనకకశిపుసం
     రంభనిరాస రమాస్తన
     కుంభద్వయకలితగేహగురుభుజమధ్యా.303
మాలిని. శుకవినుతకలాపా శుద్ధబుద్ధస్వరూపా
     వికసితజలజాక్షా విశ్వరక్షైకదక్షా
     సకలరిపునిరస్తా శంఖచక్రాబ్జహస్తా
     ప్రకటితశుభగాత్రా పద్మగేహాకళత్రా.304

గద్య.
ఇది శ్రీనృసింహవరవ్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్రయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైనవాసిష్ఠరామాయణంబునందు
నిర్వాణప్రకరణం బన్నది
పంచమాశ్వాసము


సంపూర్ణము

చంద్రికాప్రెస్సు, చాకలపేట, మదరాసు ౼ 1935