పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

వరాహపురాణము

ఫలశ్రుతి

మ.

కపటస్వాంతులు గాక, యెవ్వ రిల నాకాంక్షించి, యేతద్వరా
హపురాణంబున నాదిఖండచరితం బాద్యంతము న్విందు, రా
నిపుణు ల్గాంతురు పుత్రపౌత్రధనవాణీసంపదాయుష్యము
ఖ్యపదార్థాదితసౌఖ్యతృప్తియుఁ, దుదిం గైవల్యసంప్రాప్తియున్.

263

ఆశ్వాసాంతపద్యగద్యములు

లయవిభాతి.

విమలగుణభూష! బుధకమలవనపూష! నిజ
[1]సుజనపరితోషజితహిమకరవిశేషా!
సమదరిపుజైత్ర! నవకుముదనిభనేత్ర! కుల
సముచితవిచిత్ర! పరిణమితనిజమిత్రా!
ప్రమదరసలోల! హతసమదహితజాల! ముర
విమతనతిశీల! మతిశమితమదలీలా!
యమరపతికల్ప! రతిసమరబహుశిల్ప! బలి
దమనపగితల్పఫణిరమణసమజల్పా!

264


క.

రూపాపహసితసుమన | శ్చాప! కలాలాప! దానసౌమనసమణీ |
దీపితహృత్పుటపేటీ | గోపితరుచిపూర్ణమదనగోపాలమణీ!

265


మాలిని.

శతమఖసమభోగా! సాధురక్షానురాగా!
సతతహరిసపర్యా! సప్తసంతానధుర్యా!
వితరణగుణధామా! విస్ఫురత్కీర్తిసీమా!
హితజనసురభూజా! యెజ్జయామాత్యరాజా!

266

గద్యము

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్ట ప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ బంచమాశ్వాసము.


సంపూర్ణము

  1. సుజన (ప్రాస యతి?) - అన్ని ప్ర. (సుముఖ?)