పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

147


తే.

దేవకీదేవి కి ట్లిందిరావిభుండు | కృష్ణుఁడై పుట్టి, దైత్యుల గీటణంచి,
దేవసన్నుతచరితుఁ డాదేహ ముడిగి, | కమలనాభుండు నిజనివాసమున కరిగె.

222


తే.

ఎపుడు దానవు లుదయించి, రపుడు చక్రి | తద్వినాశంబు [1]గావింపఁ దగినయట్టి
వేష మంగీకరించి, యావిర్భవించుఁ | గాన, హరి[2]చర్య మంగళకారణంబు.

223

జీవుని జన్మకర్మబంధనము

సీ.

విను, పాంచభౌతికవిగ్రహంబులు దాల్చి, | భూవలయంబున జీవరాశి
మానసప్రేరిత మది, సంతతంబును | బహువిధఘోరపాపము లొనర్చి,
రౌరవప్రముఖనారకకూపములఁ గూలి, | యందుఁ బాతకఫల మనుభవించి,
[3]పాపానురూపరూపములఁ గమ్మఱఁ బుట్టి, | యజ్ఞానభవమోహ మాక్రమింపఁ,


తే.

బుత్త్రదారాదిసంగతిఁ బొదలుచుండుఁ | బాము మూర్కొన్నవానికి వేము తీయ
నైన కై వడిఁ, బుత్త్రమిత్రాది[4]రతుల | కధమసంసార[5]సుఖమును మధుర [6]మగును.

224


వ.

అట్టి సంసారంబునం దగులువడి, [7]విశిష్టాదు లాదానాదిక్రియాసంయుక్తులై, యధికారి
విశేషంబున జ్ఞానోదయపర్యంతంబు కర్మప్రకాశంబగు నిగమమార్గంబు విమర్శించి, కర్మంబు
లాచరింపుచుఁ, దత్కర్మనాశంబై, బాహ్యగతమనోమాయారహితంబగు సమ్యగ్జ్ఞానంబు
దొరకక మోహితులై వర్తింతు రని చెప్పి.

225

ఆశ్వాసాంతపద్యగద్యములు

స్వాగతము.

[8]రోషదూర[9]శమరూపితవేషా! | వేషయోగ్యగుణ[10]విస్ఫుటభూషా!
భూషణాకృతవిభుత్వవిశేషా! | శేషభోగిసమచిత్రమనీషా!

226


క.

ఫణిశయనచరణకమల | ప్రణమితనిజ[11]మూర్ధభాగ! భాగవతాళీ
గణనీయమహిమ! హిమకర | మణినిర్మలకీర్తిధామ మంత్రిలలామా![12]

227
  1. వారింప - తా
  2. సర్వ - తీ
  3. పాపానుకూల - తి,తీ,హ,ర
  4. గతుల - మా
  5. సుఖమతి - తీ; ముఖముఖ - తి
  6. మగుచు - మ,మా,హ,క
  7. విశిష్టులు సదాసావిక్రియా - మ; విశిష్టు లాదానవిక్రియా - తా; విశిష్టులు దాసాక్రియా - తి; విశిష్టులు సదానక్రియా - తీ; విశిష్టజనులు దాసాదిక్రియా - హ; విశిష్టులు దాసావిక్రియా - ర; విశిష్టులు దాసాదిక్రియా - క
  8. దోష (యతి?) - మ, మా
  9. మద - తా
  10. నిస్ఫుట (యతి?) - మ
  11. మూర్ధ్వ - అన్ని ప్ర.
  12. ఈ ప. ముక్తపదగ్రస్తము.