పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

88


ఉ.

కాలము చేరువయ్యె నని కానక, యాతఁడు తత్పురంబులో
వేలకుఁ గల్గి, మోటుగల విప్రునిగేహముఁ గన్నపెట్టి, తృ
ష్ణాలులితాత్ముఁడై, బలముచాయ యెఱుంగక సంచరించి, యు
న్మూలితచేష్టితుం డగుడు మూర్చిలి, తోడనె లబ్ధసంజ్ఞుఁడై.

119


క.

ఆలో ధనసంగ్రహమున | కై లేచి భయంబు లేక యాద్విజుగృహముం
[1]గేల వెరంజుచుఁ జోరుఁడు | సాలగ్రామాభిషిక్తజలములు గనియెన్.

120


వ.

ఇట్లు గనుంగొని, యమందానందంబు నొంది.

121


క.

అవి దప్పిదీరఁ గ్రోలిన | యవసరమున, యమునిదూత లాశూరాస్యున్
జవమున డగ్గఱి, [2]పాశ | ప్రవిబద్ధుని జేసి, యాత్మపట్టణమునకున్.

122


చ.

కొని చనునంతలోనన, ముకుందునికింకరు లడ్డగించి, త
ర్జన నినదోగ్రలీల సమరం బొనరించి, కృతాంతదూతలం
[3]గనుకనిఁ బాఱఁద్రోలి, భుజగర్వము దివ్యులు గాంచి మేలుమే
లని కొనియాడఁ, జోరుఁ గొని యప్పుడ యేఁగిరి చక్రిపాలికిన్.

123


వ.

ఇవ్విధంబున సాలగ్రామతీర్థపానవిలీనకల్మషభాసురుండగు చోరుని విడిపించు
కొని, వైకుంఠనగరంబునకుం బంకజోదరుకింకరు లరిగినఁ, గాలదూతలు పరాజయఖేద
సమేతులై, సమవర్తికడకుం జని యిట్లనిరి.

124


ఉ.

దేవరయాజ్ఞ మోచి, జగతీస్థలి కేఁగి, సమస్తదోషపుం
జావిలమానసుండగు దురాత్ముని, జోరుని బట్టి తేరఁగాఁ
జేవిడిపించి, యాఖలుని జేకొని రంబురుహాక్షదాసు లి
చ్ఛావిధి, [4]మున్నువోలె నిఁకఁ జాగవు తావకభృత్యకృత్యముల్.

125


సీ.

అని యిట్లు విన్నవించినఁ, గృతాంతుఁడు రోష | కలితుఁడై త్యక్తాధికారుఁ డగుచుఁ,
ద్రిదివంబునకు నేఁగి దేవతాభర్తకు | నీకథావృత్తాంత మెఱుఁగఁజెప్పి,
యతనితోఁ గూడి దుగ్గాబ్దిమధ్యమునకుఁ | జని, శేషశయనుని జలజనయను
దర్శించి, బహువిధస్తవములఁ గొనియాడి, | కరములు నిటలభాగమునఁ జేర్చి,

  1. బోలగ వెదకుచు - తీ
  2. బహుపాశవిబద్ధుని జేసి యాత్మసదనంబునకున్ - తి,తీ,హ,ర
  3. గనుగొని - మా,తీ,హ
  4. మున్నవోలె - త