పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

81


సీ.

చక్ర మొక్కటి శిరస్స్థలమున ధరియించి | శోభిల్లునది చక్రనాభిమూర్తి,
యుభయపార్శ్వములందు నొగి మత్స్యరేఖలు | మహిమఁ దాల్చినయది మత్స్యమూర్తి,
భూరివక్త్రమును దంష్ట్రారేఖయును యతి | [1]నికరపూజ్యము నుగ్ర[2]నృహరిమూర్తి,
[3]డాపల గండ్రగొడ్డలి దక్షిణమునఁ జ | క్రము [4]గల్గ భార్గవరామమూర్తి,


తే.

చాపసాయకరేఖలు నవ్యసీమ | రమణఁ గైకొన్నయది రఘురామమూర్తి,
పీతమును గూర్చ సన్నిభపృథులచక్ర | కీర్తనీయంబు నగునది కృష్ణమూర్తి.

105


క.

విను, నాలుగుచక్రంబులఁ | గనుపట్టుచు, [5]సేవ్యమానకామ్యార్థదమై
వినుతికి నెక్కు జనార్దన | మను మూర్తి, సమస్తపూజ్య [6]మనఘచరిత్రా!

106


క.

చారుసమచక్రయుతము శి | రోరూఢసువర్ణబిందురుచిరము, వనమా
లారమ్యమునై లక్ష్మీ | నారాయణమూర్తి తనరు నతసౌఖ్యదమై.

107


తే.

[7]వామచక్రసమేతంబు వర్తులంబుఁ | జరేఖాయుతంబును, జారుధవళ
వర్ణకలితంబునై, దధివామనాఖ్య | మూర్తి శోభిల్లుఁ బశులాభమోదకరము.

108


వ.

ఇట్టి మూర్తిభేదంబులయందుఁ గపిలంబుసు, [8]దర్దురంబును, భగ్నంబు, నతిరూక్షం
బును, బహుచ్ఛిద్రంబును, బహుళాంకంబును, నిస్తలంబును, స్థూలంబును, నూర్ధ్వ
వక్త్రంబును, నధోవక్త్రంబును, బహువక్త్రంబు, నేకవక్త్రంబును, విశాలవక్త్రంబును, బార్శ్వ
వక్త్రంబును; వృత్తమాత్రాష్టమబాగాదికవక్త్రంబును, లగ్నచక్రంబును, దగ్ధంబును, నతి
రక్తంబును, భీషణంబు నగు సాలగ్రామంబు సత్పుత్రాదినాశకరంబు గావునఁ బరిత్యజించి,
దోషరహితంబులుసు, లక్షణసహితంబులు నగు సాలగ్రామంబులు పూజాదానయోగ్యంబు
లుగా నెఱింగి, యంగీకరింపవలయు.

109


తే.

ద్వారకాపురి, గండకీతటిని, చక్ర | తీర్థనారాయణక్షేత్రదేశయుగము
సంభవస్థానములు మునిసార్వభౌమ! | జగతి హరిమూర్తివరశిలాసంఘమునకు.

110


తే.

ద్వారకాసంభవం బాయతంబు, వర్తు | లంబు గండకీశిలయున్నతంబు చూడ
భవ్యనారాయణక్షేత్రసంభవంబు, చక్ర | తీర్థజాతంబు చక్తవిస్తృతయుతంబు.

111
  1. గణపూజ గలది యుగ్రహరిమూర్తి - తీ
  2. హారిమూర్తి (యతి?) - మ,తా,తి,హ,ర,క
  3. దాపల (ద - త యతి) - అన్ని ప్ర. ర. ప్ర; శో చాపల రఘురామమూర్తి, లుప్తము.
  4. గల్గినది భృగురామమూర్తి - తీ
  5. సేవమాన - అన్ని ప్ర.
  6. మఖిల - తీ
  7. ఈ ప. మ,తి,తీ,హ,ర,క ప్ర. లో లుప్తము
  8. దుర్ధరంబు - మ,మా,త,తా