79
తీరదు. తారాచంద్ర విజయము, బిల్హణీయము మున్నగు కథల రూపకములు రూపమున పేర్లు మార్చి మార్చి వ్రాసిరి. ఇతర కథలెన్ని యో యున్న నేల? యని వారి రసికతకుఁ బనికిరావు. రసములలో రాజగుటం బట్టి శృంగారము పచ్చిదై నను విడువరానిదయ్యెఁగదా! పోనిండు. పాటలో పసలేనందుకు నాట్యములో నసయైన నుండవలెనని కాఁబోలు లేనిపోని సంవిధానములఁ గల్పించి, రసాభాసముగ నాయికా నాయకులతో శృంగార సల్లాపములఁ జేయించుచు గంటలకలఁది రంగమున వారిని నాట్యమాడించిరి. చాలనందుకు ప్రశ్నోత్తర రూపములగు పాటలఁ గూర్చి జేనెడుకు జేనెడు, మూరెడుకు మూరెడు, బారెడుకు బారెఁడుగ నర్థములేని ప్రశ్న కవసరములేని యుత్తరము లిప్పించుచు రసముతోడ నీతినిగూడ కొంపఁగూ- ల్చుటఁ జూడ నేరసజ్ఞనకయిన మనసు కళుక్కు మసకమానదు.
ఇంతటితోఁ బోయెనను కొనరాదు. ప్రత్య- క్షముగ రంగమునఁ బ్రదర్శింపఁ బడదగని విషయ ముల ప్రసంగము సందర్భ వశమున గల్గిన చోట బాచీన రూపకకర్తలు సంవిధానమును ముద్దుగ . మార్చి తేలిపోవుచుండిరి. ఆధునికుల రసికత