Jump to content

పుట:వదరుబోతు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80

కీమఱుగు మాటులు సరిరావు. నాయకుఁడు వేశ్య యింటికరుగు సంవిధానమును గల్పించి యొక కవి రంగమున వీధి బొజుంగులు సానివాడకుఁ బోవునప్పటి యాచారములును వేశ్యతోడి సంభా షణచాతుర్యాదులును తూచా తప్పకుండ ననుభవ హీనుల కుపకరించులాగు వ్రాసి వారి కృతజ్ఞతకుఁ బాత్రుఁడయ్యె. మఱియొక కవిశిఖామణి తారా ల శశాంక విజయమునఁ బడకటింటిలోఁ దగుమం- చముపైఁ గూర్చున్న చంద్రునకుఁ దువ్వుచు సర్మోక్తుల దేలుచున్న తారా దేవికిఁ ఒరవశత్వమునఁ బోక ముడి వీడినట్లు పైశాచ శృంగార వర్ణనగల రంగము నొక దానిని గల్పించే ననుటకే సిగ్గగుచున్నది. ఇట్టి నాటకము లింకనుఁ గొన్ని బయలుదేఱ గలవా వేఱు దుర్నయ మేల? మన ఆంధ్రనాటక పితామహుని నాటకరత్నము లలోనెల్ల నతని విషాద సారంగధర మే సానదీఱినది. అతని రచనా పాగల్భ్యమును నాటక కళా కౌశల్య మును సంవిధాన సంపాదన ప్రతిభయు రసపోషణ చాతుర్యమును నందుఁ బూర్ణముగఁ బ్రతిఫలించిన ననుట యతిశయోక్తికాదు. కాని యెంత పక్వ మయిన నేల దూకథ పుచ్చిన పండు! తొడిముకడనో మఱి యేమూలనో తీసి యింత కలదన్నను గూడ