Jump to content

పుట:వదరుబోతు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

గని యాముద్దియ నడిగి చల్లపుచ్చుకొని త్రావి తృప్తుఁడై యభిమత మడుగు మనఁగా నాజవ్వని తన చిత్త మాతినిపై హత్తెనను నర్థమిచ్చు నీ హృద్యమగు పద్యముం బఠించెనఁట!

   "ఇందుం కైరవిణీవ కోకపటలీ
          వాంభోజినీవల్ల భం
    మేఘం చాతకమండలీవ మధుప
          శ్రేణీవ పుష్పంధయం
    మాకందం పికసుందరిన తరుణీ
          వాత్మేశ్వరం పోషితం
    చేతోవృత్తి రియం మమాట నృపతే
          త్వాం దుష్టు ముత్కంఠతే”
 

ఇది నిజమైనచో నామహనీయుని ప్రభావ మెట్టిదో యిప్పటి మన యలఁతియూహల కగోచరము.

కవిత్వ మంత సులభముగ లభింపఁగల పదార్థమైనపు డంతకన్న మనము గాంక్షించు కామితమేలేదు. కవనము కళ - అందును జిత్ర కళ. కళలన్నియు సభ్యాసమూలములు. స్వభావ వశమునఁ గాక బలాత్కారముగ నార్జించిన కవన శక్తి ప్రేమచేఁ గాక నిర్బంధమున మెడకంటఁ గట్టుకొన్న తరుణింబోలె రసాభాస ప్రసక్తి కాకర