Jump to content

పుట:వదరుబోతు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ఱచి చూపఁగల శక్తి యొక్క సత్యమునందే యున్నది. మసజీవయాత్ర కడ తేర్పవలయునన్న సన్మార్గముననే పోవలయు. దానిఁ గనుగొనుటకు సత్యమునకన్న వేరు దీపమేలేదు. కనుకనే,

"There is no Religion higher than Truth"

అను నానుడి.


ఆధునిక కవిత్వము

12

భోజరాజు ముఖముఁ జూచి నంత నెట్టి మూర్ఖునకైన నవరస భరితమగు కవనము చెప్పు శక్తి తనంత వచ్చుచుఁడెడిదఁట! విద్యాగంధ మెఱుఁగని వారుగూడఁ గవులగుచుండిరఁట! అక్ష రజ్ఞాన శూన్యలగు గొల్లపడుచులును, ఎఱుక జవ్వ నులు సయితము పద్యము లాశుధారగ నల్లఁగలుగు చుండిరట! ఒకనాఁ డామహానుభావుఁడు వేట నుండి మట్ట మధ్యాహ్నమున నొంటిమై మఱలి వచ్చుచు నాతపక్లేశ భిన్నుఁడై చాలదప్పిగొని యుండఁగా నాత్రోవలో నొక గొల్లపడతుక చల్ల కుండ నెత్తి నెత్తికొని పోవుచుండెను. అతఁడది