ఈ పుట అచ్చుదిద్దబడ్డది
65
కిపుడు సుఖస్వరూపము బాగుగఁ దెలిసినది. ఇంక మీకు నేనియ్యఁ దగిన దేమియు నుండదు. పొండు!" అని యానతిచ్చి యంతర్థాన మందెనఁట
_____________
సత్యసంధత
11
తిమింగిలాది ఘోరజలజంతుసంతాన సంకు లమె, మైనాక ప్రముఖ శిఖరి కులదుర్గమమై జంఝామారుతో భూత కల్లోల మాలికాకులమై సలిల ప్రవాహ దురవగాహమైన మహార్ణవమునఁ దప్పుత్రోవపట్టిన కర్ణధారకుఁడు తన్నే కాక తోడివారింగూడఁ జెఱచును. తెలిసియైన, పొరఁ బాటుననైన, ఆజాగరూకతనైన నొక్కమారు, మారు త్రోవఁబడినచో నే తిమింగలముబారిపడి యో ఏ గిరిసానువుల డీకొనియో, ఏసుడిగుంతలఁ జిక్కియో, నావ యపాయముపాలు గాక గట్టు? చేరుటరిది. ఈప్రపంచము మహాసముద్రము వంటిది. భయావహరోగజాలములు, వికారవదన గహ్వర ములఁ దెఱచి కబళింప సిద్ధముగనుండుకు వ్యసన పరంపర లెంత దృఢచిత్తమునేని ప్రయ్యలు చేయఁ జాలియుందురు. విషయవ్యామోహ వీచికలు తల