64
కబ్బని నూఁగు మీసములఁ దిప్పుచు యుద్ధసన్న ద్దుఁడు కాఁగా, నతని ప్రతిపక్షుఁడు “జాగ్రత!” యనుచు నశనింబోలు ముష్టింజూపెను. కొంత తడవు ప్రహారములతో సన్యోన్య దేహములపై వారు పూర్వపక్ష సిద్ధాంతములఁ జేసుకొను చుండిరి.
అంతలో సకాలమున నాకసమున మెఱుపు మెఱసినట్లయినది. ప్రథముఁడు పైకిఁజూచి “అదో భగవంతుఁడు?" అనియె. వాదములకింక నవకాశము లేదు. ఈశ్వరుని యెదుట నిపుడేమని విన్నవింప వలయునను విషయమై వారు చాలఁ జింతాక్రాంతు లైరి. అపుడించుక వివేకశాలియగు నాలవవాఁడు 'ఈవాదములతో మన కేమియు స్థిరపడినది కాదు. స్థిరపడినదికాదు. మసలో నొకఁడు కోరినది యితరులకు రుచింపదు, కాన నందఱకు రుచించునట్లుగ నే నొకటి చెప్పె దను " అని యొక మార్గము బోధించెను. అందఱును సమ్మతించిది.
ఆకసమునుండి విమానము క్రింది కవతరించెను. "ఏమి నిర్దరించితిరి? మీకేసుఖము కావలెను?” అను నక్షరములు భగవంతుని నోటి నుండి వెడ లియు వెడలక మున్న నలుగురు నేక వాక్యముగ “స్వామి! మా కేసుఖమునువలదు.మేము కోరు వరమింతే అనిరి. భగవంతుఁడును నవ్వి "మీ