Jump to content

పుట:వదరుబోతు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49


తాతస్య కూపో య మితి. బువాణో
   క్షారం జలం కాపురుషాః పిబంతి

అని యితరులఁ దూలనాడుచు క్షణమున కొక వేషము వేయుచు, దినమున కొక వ్యాపా రము సేయుచు, నూసరవెల్లులవలె మార్పు చెందు చుండుట వీరి లక్షణము. ఈ యన్నల యనుకరణ విద్యకు విధినిషేధములును కాల దేశములును మంచి చెడుగులును లేవు. నేఁడొకఁడు పొరఁబాటుననైనఁ తలపాగా నోరగఁజుట్టినచో "రేపటి కప్పుడే నూర్గుక తలమీఁద నోరపాగా లుండును; నేఁ డొకఁడు బుసుపోక యన్య దేశీయులఁ బలె దుస్తులధరించెనేని యెల్లుండి వేయిమంది “నల్లదొరలు”గా నుందురు; చక్కఁజేసికొన నవకాశములేని సోమరియొకఁడు నేఁడు జుట్టుఁగత్తరించెనేని మఱుదినమున ననేకు లకు శిఖభారమే; నేఁ డాని బెసంటమ్మనిచ్చేసి బహి రంగముగా దివ్యజ్ఞానతత్త్వమును గూర్చి పలువిధ ములుగ సుపన్యసింపనిండు; రెండుమూడు దినము- లలో నేయక్షరజ్ఞుని మేజా పైనఁ జూచినను, ఏ విద్యార్థి యంగరఖా జేబులోఁ గన్ననుగూడ నొక చిన్ని “భగవద్గీత” పుస్తకమే! ఇంతటితోఁ బోయె వనుకొనరాదు. తరువాత నొక “మహమ్మదు”. సాక్షాత్కరించి మోక్షమార్గమునకెల్ల నెత్తినున్న