Jump to content

పుట:వదరుబోతు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

పరిణామములకును దగినవాని నేర్పఱచికొని గ్ర- హించి యుక్తరీతి నుపయోగించుకొనవలసిన భా- రము మనదియ.వంటచెఱుకులకై పోవుచు త్రోవలో దుకాణమున నున్నవాని నంతయు బేరమాడుచు నిలుచున్న వాని నున్మత్తుఁ డనక తీరదుగదా.

సంఘమున నిపుడు కానవచ్చు. ననర్థము లెన్నియో యించుమించుగ ననుకరణ విషయమున మనము చూపుచున్న యశ్రద్ధ వలసనే కలుగు చున్న వనుటతప్పుకాదు. ఈవిషయమున ననాగరకు లగు పల్లెటూరివారి జాగరూకత- తెలియని జాగ రూకత యన్నను మానెఁగాని - యెంతయు శ్లాఘా పాత్రము. చిరకాలముగ వారికలవడిన యభ్యాస- ములపై వారికెంత దృఢప్రీతియో, నూతనవిషయ ములపై వారికంటే యనాదరము. తృప్తికరముగఁ దమకది యుఫయోగకారి యని పలువిధములుగ వారు నమ్మగలిగిననే తప్ప యెంద ఱెన్ని యుప న్యాసము లిచ్చినను దటాలున నితరుల ననుకరించి నూతనమార్గముల నవలంబించి చిరాభ్యస్తముల విడినాడరు.

కాని, ప్రకృతిదత్త యయిన యీయను కరణశక్తిని శక్తివంచనలేకుండ సంపూర్ణోపయోగ మునకుం దెచ్చినవారు మన నవనాగరకులే.