Jump to content

పుట:వదరుబోతు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

కాని, నాకొక్క సందేహము దానికిఁ గూడ విద్య నేర్పినచో నిట్టిగుణమే పట్టువడునేమో?

విద్యయనుమాట కెన్ని యర్థము లున్నవని వాదించినను సామాన్యముగ వ్రాత చదువులకే యది రూఢముగ నున్నది. పూర్వకాలమున సంస్కృతభాషలో సాహిత్యమునందో, శాస్త్రము నందో, పాండిత్యము గలవాఁడే విద్యావంతుఁడు. తదితరు లపుడు గౌరవమున కనర్హులు. అన్య భాషాజ్ఞానము గలవా రాకాలమున ననార్యులుగ భావింపఁబడిరి. ఇప్పుడో విద్యయనఁగా క్రమ క్రమముగ నాంగ్లేయ భాషాభ్యాసమునకే యన్వ యింపఁ బడుచున్నది. కాననే "ఎ. బి. సి.” రాని వాఁ డెంత బృహస్పతి యయినను విద్యావంతులలోఁ బరిగణింపఁబడఁడు. అట్టివాని విద్య విద్యగాదు; బ్రతుకును బ్రతుకుగాదు అందఱవలె నద్దె యిచ్చిన తరువాత గూడ నతనికిఁ బొగబండిలోఁ గూర్చుండ తావుసయితము దొఱుకదు. వీరిలో నెవరు నిజముగ విద్యావంతులు?

ఇంతియగాదు. ఒకరి విద్య యింకొక్కరి కవిద్య. వేద వేదాంతముల సారమెఱింగిన సాత్వికుఁడు శుద్ధముగ మాతృభాషనేని మాటాడ నేరని మన విద్యార్థులంజూచి గొణఁగు కొనుచు