Jump to content

పుట:వదరుబోతు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

they cannot find time to do that which they fancy they wish. In truth, people can generally find time for what they choose to do"

-SIR JOHN LUBBOCK



విద్య

విద్యా ప్రభావమును వర్ణించుచు భర్తృ హరి కడమాటగ “విద్యావిహీనః పశుః" అని వచించెను. ఇది యాధారముగ విద్యావంతులు మనుకొనువారు విద్యాహీనులు నెంతో నీచముగఁ జూచుచు వారికన్నఁ దామొకమెట్టు పైనున్నట్లు భావింతురు. సంఘములో విద్యాహీనుల కెందును గౌరవములేదు. ఇట్టి యభిమానమన్ని సంఘ ములలోను పురుషులయందె కాక స్త్రీలయందును ప్రబలుచున్నది. కాని నాకుఁ జూడ నిది యొక శోచనీయమైన దుర్నయము. విద్యావంతుల మను కొనువా రితీరులఁజూచి నవ్వవలయునేల? పట్టు చీరఁ గట్టుకొన్న భాగ్యశాలిని యితరులు గేలి సలుపవలెనని ధర్మశాస్త్రమా! కొమ్ముకుప్పెలును చిఱు గంటలును గల వృషభ మెట్టిజతతో కాడి గట్టినను గొంచమైన యేవగించుకొనదు కదా?