Jump to content

పుట:వదరుబోతు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

తరువాత ననేకులఁ బ్రశ్నించి కొన్ని యుత్తరములకను గొంటిని. ఫలము తృప్తికరము గాదు.

నిన్న రాత్రి బజారున హరికథాకాలక్షేప మని విని యట కరిగి దూరమున గుంపునఁ గూ- ర్చుంటిని. నాఁటికథ “గరుడగర్వభంగము”. త న్నవమానింప నెంచిన నారదుని మోసపుమాటల నమ్మి యమాయకురాలగు సత్యభామ, వనవాస మున నున్న సీతాదేవివలె వేషము ధరింపఁగోరి మొగమునిండ మసిబొట్లు పెట్టుకొని కుంటినడ కలతో, శ్రీరామాకృతితో నున్న కృష్ణుని కడ కరుగుదెంచుచుండెనని కథకుఁ డభినయ పూర్వక ముగఁ నుపన్యసించుచుండెను. క్రిక్కిరిసియున్న జనులందరు కడుపు లుబ్బ నవ్వుచు సత్య నవమా నించుచుండిరి. కథకుని చేరువనున్న పండితులు తలలూచుచుండిరి. వాస్తవముగ నింతటి యన మానమే గల్గియున్న సాత్రాజితియంతటి మానవతి యూపిరితో నుండియుండ దనుకొంటిని.

అంతలో నాయున్న చేరువ నొక చిన్న కలకలము గలిగెను. ఏనడో యనాథ బాలుఁ డొకడు రెండు దినములుగఁ దన కాహారములేదని దీనముగ నచటి వారి నన్నము యాచించుచుండె. ముఖవైఖరి జూడ వానికథ నిజముగఁ దోచినది.