Jump to content

పుట:వదరుబోతు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

ఇక సురాదేవీ వరప్రసాదముననో, గానామృత రసాస్వాదమహిమ వలననో, చొక్కి యిహపరము లెఱుఁగక వికార చేష్టలఁ జేయుచు సద్వైతసుఖ మనుభవించు చరితార్థ జన్ములగువారి యానంద పరిమితి వర్ణింపఁ దరముగాదు.

ఇట్టి కృతార్ధ జీవితులలో నింకొక తెగవారిని మాత్రము స్మరింపకుండఁ జాలను. "దేహ మశా శ్వతము ప్రాణము బుద్బుద ప్రాయము. బ్రతికిస నాఁడే బాగుగ తిందము గాక!" అనుట వీరి మూలమంత్రము. ఈమహానీయులకు “దినముల లోపల నుత్తమ దినమే తద్దినము.” నాకుఁజూడ వీరి పద్ధతి యొకవిధముగ మెఱుఁగే! తత్త్వములలో నెల్ల ముఖ్యమైనది - దేహ మశా శ్వతమని - వీరు మాత్రమెఱుఁగుదురు గాన.

ఈ యాలోచనల సారాంశము ప్రపంచ మునఁ బ్రతిమానవునకునుఁ గృతార్ధత వేఱనుట! కాని తుదకీ ఫలితార్ధమును విశ్వసింప నైతిని. సర్వసముఁడగు సృష్టికర్త కిట్టి పిచ్చియుద్దేశ ముండ దనుట స్పష్టముగఁ దోచెను. అప్పటికిఁ జాలఁ జీకటి పడియుండుటచే యోజనలఁ జాలించి యెవరినైన మహనీయుల నడిగి యీపశ్నమున కుత్తరము వడయ వచ్చుననుకొని యిలుసేరితిని.