Jump to content

పుట:వదరుబోతు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105

సన పేరున సారాయములలో మమ్ము ముంచుచున్న వారు. ఇంతియకాదు. స్వేచ్ఛగఁ బెరుగక ముమ్మపుడప్పుడు కత్తరించునాచారము ప్రారంభ మయ్యె. ఆర్యా! మాకేమో భయమగుచున్నది. ఇఁకఁ గొన్ని నాళ్ళలో, యీ నాగరకత నబ్బు రథ ముపై నెక్కి సీమకత్తులు నూఱుచు మాపై నిర ర్ళళగముగ దండయాత్ర వెడలఁగలదనియు అప్పుడు స్త్రీ పురుషులలో నెవరుగాని మా కభయమిచ్చి మమ్ము పోషించువారే యుండరనియు మాకు సూచనలు స్పష్టముగ గానవచ్చుచున్నవి. మును పటి కవులు స్త్రీలనుమాత్రము వర్ణనలకై పూ బోడులనిరిగాని యిఁకమీఁద పూలు లేకున్న పీడ వదలినది స్త్రీలను పురుషులనుగూడ నా పేరునఁ బిలుచుకాలము రానున్నది కాబోలు?

మహాశయా! మాగతి యెవరు విచారించు వారు? మీరయిన మాపైఁ గరుణించి సంఘ మునకు హితము చెప్పరాదా? .

ఇట్లు విన్నవించు,

కురులు.”