104
చున్న యీయన్నలకు మేమాభారము? గోష్పా దమాత్ర పదేశమునకు మేము తగమా?
ఇక నాగరిక తరుణీమణులును మమ్ము పెక్కు చిక్కులం బెట్టుచున్నవారు. మునుపటి సొగసులన్నియును మూలఁబడినవి.వారిఁ కొప్పు లిపుడు మెప్పులు కావు. తొల్లిఁటికాలమున నెందు లకు గొఱమాలిన జడలని వీరి యాశయము. కొన్ని నాళ్ళు మమ్ములఁ గట్టిగా బిగియఁబెట్టి లాగిలాగి పురిపెట్టిరి. కొంతకాలము చిత్రవిచిత్ర ముగ విరచికట్టి బాధించిరి. మొగ్గలతో నలంక రించెదమను నెపమున నిలువెల్ల సూదులతో గుట్టి సూత్రములతో బిగియఁగట్టిరి. అలంకార వ్యాజ మున మోయలేని భారమును మోయించిరి.తా- ము మున్దినదే గంగ కాకున్న నిట్టి వా యలంకార ములు? మా సహజ సౌందర్యపు తత్త్వమెఱిఁగి ప్రపంచమున నదిమాసిపోకుండ చిత్రపటములలో నైన నిలిపినందుకై రాజా రవివర్మ మాకెంతయు వందనీయుడు.
ఇవన్నియు నెటులో యోర్చుకొని యిన్ని నాళ్ళు గడిపితిమి.కాని ముఁదున్నది ముసళ్ళ పండుగ. నవనాగరకత స్త్రీలలో వ్యాపించుకొలఁది మాకుఁ గష్టములు రెట్టింపగుచు వచ్చినవి. సువా