రేఖా చిత్రాలు ఆనాటి నిర్మాణపు పనులకు దర్పణం 3 వారివద్ద ఉన్నాయి. ఇలాంటి అపురూపమైన సేకరణ ఎంతో వారివద్ద వుంది. 82 సంవత్సరాల వయసులో వంటరిగా వారక్కడ జీవిస్తున్నారు. వారి సతీమణి విశాఖపట్నంలో ఉంటారు. నేను వెళ్లే సమయానికి వారంత ఆరోగ్యకరంగా లేరు. వారిని చూసి నా మనసంతా వికలమైంది. ఒక ఆంగ్లేయమిత్రుడు అప్పడప్పుడు సహకారం అందిస్తూ ఆయన మంచి చెడ్డలు గమనిస్తూ వుంటాడని చెప్పారు. ఆయన శరీరం తగిన విధంగా సహకరించకపోయినా ఆయన మనస్సు మాత్రం శరవేగంగా పయనిస్తోంది.
"1890 – A Biographical Dictionary” రూపకల్పనలో ఆయన మునిగి తేలుతున్నారు. అయితే ఆయన ఎవరి సహాయం లేకుండా, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించకుండా తనకు తానే డిక్ష్నరీని రూపొందిస్తున్నారు. ఇది ఎంత శ్రమతో కూడిన విషయమో వేరుగా చెప్ప పనిలేదు. దాన్ని పూర్తి చేయాలన్న పట్టదలే ఆయనను ముందుకు నడిపిస్తున్నది.
విదేశాంధ్ర ప్రచురణల ద్వారా మహాకవి శ్రీశ్రీ చేతి వ్రాతతో ప్రచురించిన మహాప్రస్థానం గూటాలవారి తెలుగు సాహిత్యసేవకు మహోన్నత దర్పణంగా నిలుస్తుంది.
డా. గూటాల కృష్ణమూర్తి గాంధేయవాది. ఆయన మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబరు 2వ తేదీన, నిర్యాణదినం జనవరి 30న ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటలవరకు, ఒక గంట విరామంతో, నిరంతరాయంగా రాట్నం వడుకుతారు. అదికాక ప్రతిరోజు రెండు గంటలు తప్పని సరిగా రాట్నం వడుకుతారు. ఈ అలవాటును ఆయన గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. స్వదేశంలో చరఖా సంగతి అంతా మరిచి పోయినా, విదేశంలో ఉంటున్న కృష్ణమూర్తిగారు మాత్రం దీన్ని ఒక 'యోగం' గా శ్రద్ధాసక్తులతో ఆచరిస్తున్నారు.
82