పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2006 అక్టోబరు 27–28 తేదీలలో విజయవాడలో జాతీయ తెలుగు రచయితల మహాసభలను డా. గూటాల కృష్ణమూర్తిగారితో ప్రారంభింపజేయడం జరిగింది. అలాగే 2007 సెప్టెంబరు 21, 22, 23 తేదీలలో అపూర్వమైన రీతిలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు వీరు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ రెండు కార్యక్రమాల్లో నా ఆహ్వానాన్ని మన్నించి వారు పాల్గొన్నారు.

విశ్వవిఖ్యాత గాయని, నటీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిపై అపురూప గ్రంథం 'సూర్యకుమారి ఇల్విన్ - ఎ మెమోరియల్ వాల్యూమ్' ను 2008 నవంబరు 13వ తేదీన సుప్రసిద్ధ సినీ నటుడు పద్మభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆ సభకు అధ్యక్షత వహించే అవకాశం డా. గూటాల కృష్ణమూర్తిగారు నాకు కల్పించారు. తెలుగు ప్రచురణ రంగ చరిత్రలో అరుదైన, అపురూపమైన గ్రంథాన్ని వారు రూపొందించారు.

డా. కృష్ణమూర్తిగారితో చిరకాల పరిచయం ఉండటం వలన మా లండన్ పర్యటనలో వారి ఇంటికి వెళ్లాను. మొదటి అంతస్థులో వారి నివాసం. ఇల్లంతా పుస్తకాలమయంగా కనిపించింది. చివరికి బాత్రూముల్లో కూడా పుస్తకాల దొంతరలే. అవి మామూలు పుస్తకాలు కావు. ఎక్కడా దొరకని అపురూప గ్రంథాలు. ప్రత్యేకించి, 1890 దశకంలో వెలువడిన గ్రంథాలు వీరి వద్ద మాత్రమే ఆ దేశంలో లభ్యమవుతాయి. ఆంగ్ల సాహిత్య పరిశోధకులు వాటి కోసం వారింటికి వచ్చి వెళుతుంటారు. సుప్రసిద్దులకు సంబంధించిన లేఖలను, వస్తువులను భద్రపరచడం వారికి అలవాటు. సర్ ఆర్థర్ కాటన్ స్వదస్తూరితో వ్రాసిన లేఖలు వారివద్ద వున్నాయి. సరోజినీనాయుడు, తదితర ప్రముఖుల లేఖలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పడో వందేళ్ళ క్రితం తయారు చేసిన తెలుగు-ఉర్దూ నిఘంటువుకు సంబంధించిన మైక్రో ఫిల్మ్ కృషమూర్తిగారు నాకిచ్చారు.

అలాగే కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో (1948 సంll) చిత్రించిన

79