నేను, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు దేశానికి ఎనలేని సేవలు చేసిన సి.పి. బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ సమాధులు ఎక్కడున్నవో అన్వేషించి, వాటిని సందర్శించే అవకాశం కలిగితే ఈ యాత్రకు ఒక సాఫల్యత చేకూరుతుందని భావించాము.
ఇంటర్నెట్ సాయంతో కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో బ్రౌన్ సమాధి ఉందని తెలుసుకున్నాము. ఆ స్మశాన వాటిక బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైనది. 2 లక్షల 56 వేల మంది పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న గౌరవనీయులు, మహాశూరులే కాక, అప్రతిష్టపాలైన వ్యక్తుల భౌతికకాయాలు కూడా ఈ స్మశాన వాటికలో ఖననమయ్యాయి. ఈ స్మశాన వాటికలో తమతమ మతాలకు, సంప్రదాయాలకు అనువుగా ఉత్తర విధులు నిర్వర్తించుకునే అవకాశం ఉంది. 1833లో ఈ స్మశానంలో అంత్యక్రియలు మొదలైనాయి. ఇది లండన్‌లో మొట్టమొదటి ఉద్యానవన స్మశాన వాటికగా పేరుగాంచింది.
ఇంగ్లండ్ రాజు - మూడవ జార్జి కుమారుడు హెచ్.ఆర్.హెచ్. ది డ్యూక్ ఆఫ్ ససెక్స్ అంత్యక్రియలు 1843లోను, ఆయన సోదరి యువరాణి హెచ్.ఆర్.హెచ్. సోఫియా అంత్యక్రియలు 1848లోను ఇక్కడ జరగడంతో ఈ స్మశాన వాటిక ప్రఖ్యాతి మిన్నంటింది. ఈ స్మశానవాటికలో నమోదైన వారిలో 550 మంది సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీలో స్థానం పొందిన 700 మంది ప్రసిద్ధ వ్యక్తుల భౌతికకాయాలు ఇక్కడ ఖననమయ్యాయి. ఈ స్మశానవాటికలో ఆయా కాలాల అద్భుత నిర్మాణ శైలికి ప్రతీకలుగా నిలిచే విధంగా, అపురూపమైన కట్టడాలున్నాయి. కట్టడానికి, కట్టడానికి సారూప్యత లేకుండా అత్యంత సౌందర్యోపేతంగా నిర్మితమైన కట్టడాలున్నాయి. అత్యంత అద్భుత సౌందర్యరాశి అయిన ఒక స్త్రీమూర్తి పాలరాతి ప్రతిమవున్న సమాధి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రముఖ చిత్రకారుడు విలియం మూల్‌రెడి ఆర్.ఏ.{1786-1863) సమాధి వద్ద ఆయన మరణశయ్యపై
61