Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నట్లుగా పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పడమే కాక, దాని చుట్టూ ఆయన చిత్రించిన చిత్రాలను చెక్కారు. ఒక ప్రముఖ చిత్రకారుడికి శిల్పకళా వైభవంతో సమర్పించిన నివాళిగా ఇది కనిపిస్తుంది. మహర్షి దేవేంద్రనాథ్ టాగూరు సమాధి కూడా అక్కడే వుందని మాకు తర్వాత తెలిసింది. ప్రముఖుల స్థాయిని బట్టి, విశిష్టతను బట్టి సమాధులు నిర్మితమయ్యాయి.

ఈ రకంగా లక్షల సంఖ్యలో వున్న సమాధులలో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సమాధిని అన్వేషించి, కనుగొనడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. సెమెట్రీ నిర్వాహకురాలు శ్రీమతి ఎవిస్ మాకు మ్యాపునిచ్చి వెతుక్కోమన్నారు.

29,377వ సమాధిగా నమోదు చేయబడిన సి.పి. బ్రౌన్ సమాధిపై ఆయన 17 డిసెంబర్ 1884న (మరణించిన ఐదవ రోజున) ఖననం చేయబడినట్లు చెక్కబడివుంది. ఈ సమాచారం పొందడానికి 2 డాలర్ల రుసుము చెల్లించవలసి వచ్చింది. సమాధులు చూసుకుంటూ, వెతుక్కుంటూ వెళుతుంటే ఒక ఆంగ్ల వనిత - ఆమె కూడా ఏదో సమాధి అన్వేషణలో తిరుగుతూ మాకు తారసపడ్డది. ఆమె మాతో మాటలు కలిపి, మా అన్వేషణలో తోడ్పడింది. చివరికి బ్రౌన్ సమాధిని చూడగానే పడిన శ్రమంతా మరచిపోయాము. ఒకానొక దశలో సమాధిని చూడకుండానే వెళ్ళిపోతామేమో అన్న భావన కలిగి మనసంతా వికలమైంది. అలాంటి సమయంలో సమాధి కనిపిస్తే ఎంతటి మధురానుభూతి కలుగుతుందో వర్ణించలేను. సమాధి కనిపించిందన్న ఆనందం ఒక వైపు కలిగితే, ఆ సమాధి వున్న దుస్థితి మూలంగా కలిగిన వేదన ఇంతా అంతా కాదు. సమాధి మీద అక్షరాలు కనిపించీ కనిపించకుండా వున్నాయి. డా. లక్ష్మీప్రసాద్ గారు అక్కడున్న గడ్డిమొక్కలను పీకి, ఆ సమాధి అక్షరాలపై రుద్దితే, బ్రౌన్ పేరు కనిపించింది.

ఆ రోజు రాత్రి లండన్లో మాకు ఆతిథ్యమిచ్చిన డా. గోవర్ధన్ రెడ్డిగారికి ఈ విషయం చెప్పాము. డా. గోవర్దన్ రెడ్డిగారు ఏది ఏమైనా దానికి పునరుద్ధరణ చేయవలసిందేననీ, అందుకు ప్రయత్నిస్తాననీ చెప్పారు. మర్నాడు

62