| | సాంద్రశిలీముఖోపేతంబై, వితరణి నృపసభాభవనంబునుంబోలె ద్విజగణపరివృతం | 116 |
| తే. | రుక్మిణీకన్యమదిని నిరూఢమైన, విరహతాపభరంబున వేఁగి వేఁగి | 117 |
| ఉ. | పట్టెలఁ జేతు లానుకొని పానుపు మెల్లనె డిగ్గి పాదుకల్ | 118 |
| ఉ. | వేనలి జాఱ సూనశరవేదన మీఱ శ్రమాంబుబిందువుల్ | 119 |
| చ. | అనిమిషరాజనీలలలితాలకతాళకపువ్వుదోఁటకుం | 120 |
| సీ. | అడుగులఁ గమ్మపుప్పొడి చుఱుక్కున నాట గండుఁగోయిలరొద గుండె లదర | |
| తే. | దగిలి యచ్చోట నిలువంగఁ దరముగాక, బెగడి దిగులున వేవేగ మగిడి చెలులఁ | 121 |
| తే. | చెలుని చెంగల్వకొలఁకులకెలన వలపు, గులుకుపూఁదేనెసోనలు చిలుకుచున్న | 122 |
| ఆ. | ఏమి సేయుదాన నిఁకఁ జలింపక పిక, ప్రతతి గూయఁదొణఁగె రామరామ | 123 |
| క. | అలికీరశారికాదులు, చెలిమి యొకింతైన మదిని జేర్పక యకటా | 124 |
| క. | చలమా నీ కటు మధుకర, కులమా వలమానకీరకోకిలశారీ | 125 |
| క. | పదమాననీకధృతిసం, పద మానుపఁ దలఁచి నీదుపద మాపదకా | 126 |