Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 రామాయణ విశేషములు


"జనకుడు సీతయొక్క తండ్రి. అతడు యాజ్ఞ్యవల్క్య, శ్వేత కేతు, ఆరుణేయాదులకు బ్రహ్మవిద్యను బోధించెనని శతపథ బ్రాహ్మణములో వర్ణించినారు. యాజ్ఞవల్క్య వాజసనేయి అను నతడు జనకుని ఆస్థానపురోహితుడు. అతడు యజుర్వేదపృథక్కరణమును చేసెను. శుక్ల యజుర్వేదము, శతపథ బ్రాహ్మణము అను భాగాలుగా చేసెను” అని దత్తుగారు వ్రాసినారు. దీనినిబట్టి శతపథబ్రాహ్మణ రచనాకాలములో రామాయణము రచింపబడెనని వారి యభిప్రాయము.

సాధారణముగా పాశ్చాత్యుల జాడలలోనే మన హిందూస్థాన పండితులును నడతురు. పాశ్చాత్యులు కొన్ని చారిత్రకపు మైలురాళ్ళను స్థాపించుకొన్నారు. “యవన" అనేది ఒక మైలురాయి. ఆది క్రీ. పూ. 325 లో అలెగ్జాండరుతో మన దేశానికి దిగుమతి అయినది. ఆ కాలము లోను అంతకుముందు 300 సంవత్సరాలలోను సూత్రాలు వ్రాయబడినవి. ఆది రెండవ మైలురాయి. అంతకంటే 800 ఏండ్లకుముందు బ్రాహ్మణా రణ్యకోపనిషత్తులు వెలసినవి. (అనగా - క్రీ.పూ. 1200 ప్రాంతములో) అది మూడవమైలురాయి. బ్రాహ్మణములకు సూత్రములకు మధ్య కాలములో ముఖ్యపురాణాలు ప్రకాశమానమైనవి. అంతకంటే మరి అయిదారు నూర్ల మీడ్లకు ముందుకు వెళ్ళితే వేదాలకాలములో పడి పోతాము. అనగా క్రీ. పూ. 2000 ఏండ్ల కంటే ముందుకాలములో వేడాలు లేకుండెను. అది నాల్గవ మైలురాయి. ఈ విధముగా పాశ్చాత్య విమర్శకులు విమర్శించుతూ వచ్చినారు. ఇటీవల మోహ౯ జోదారోలోను హరప్పాలోను బయలుపడిన శిల్పాలను వివిధ వస్తువులనుబట్టి అచ్చటి నాగరికత క్రీ.పూ. 3000 ఏండ్లకన్న పూర్వముదని అంచనాలు వేయుట చేత పూర్వసిద్దాంతాలు తారుమా రగుచున్నవి. పైగా డాక్టరు ప్రాణనాథ గారు క్రీ. పూ. 4000 ప్రాంతమం దీ మోహన్ జోదారో నిర్మాణాలు జరిగే నని వాదించుచున్నారు. వారు ఋగ్వేద దశమమండలానికి ఈజిప్టులోని