Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివిధ రామాయణ కథలు

జైన రామాయణము

ప్రపంచానికంతయు వాల్మీకి రామాయణము పరిచితమయిపోయినది. భారతీయభాషలలో అనువదింపబడిన రామాయణములలో బహువిధములైన మార్పులు చేసినారు. తులసీదాసు తన కిష్టము వచ్చినట్లు మార్చెను. గోనబుద్ధుడు చాలా మార్పులు చేసెను. వాల్మీకి రామాయణములో లేని ఇంద్రజిత్తు భార్యయగు సులోచనను గోనబుద్ధుడు సృష్టించి సులోచనా సహగమనము అను భాగమును గొప్పగా పెంచి వర్ణించి వ్రాసెను.[1]శతకంఠ రామాయణమని ఒకడు వ్రాయగా అంతకు మించిన శక్తిని చూపింతు నన్నట్లుగా సహస్రకంఠరామాయణమును మరొకడు వ్రాసెను. ఆధ్యాత్మ రామాయణము, అద్భుత రామాయణము, విచిత్ర రామాయణము ఇట్టివెన్నైనను సృష్టియై కొద్దిగనో గొప్పగనో ప్రజాదరమునుగూడ బొందినవి.

అన్ని రామాయణముల ముచ్చట యేమోకాని జైన రామాయణమును గురించి మాత్రము ప్రత్యేకముగా చెప్పవలసియున్నది. "జైన రామాయణము” అను పేరుతో ఏ గ్రంథమున్నూ లేదు. హేమచంద్రుడను జైనుడు "త్రిషష్టి శలాక (శ్లోక) పురుష చరిత" అను పేరుతో ఒక గ్రంథాన్ని రచించెను. అది ఇప్పుడు ముద్రితమై లభ్యమగుచున్నది మూలమును నేను చూడలేదు. అందలి రామాయణకథను ఇంగ్లీషు వ్యాస రూపముగా నున్నదానిని చూచినాను. దానినుండియే యీ క్రింది కథ


  1. నా కడనుండిన తాళపత్రప్రతిని ఆంధ్ర విద్యాపీఠమువారు ప్రచురణార్ధము తీసుకొనియుండిరి. అందలి సులోచనా సహగమన భాగమును వారు అనుబంధములో విపులముగా ప్రకటించినారు.