Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

9

ముగా పాటపాడి కథ చెప్పుటకు తగినట్లుగా రామాయణమును వాల్మీకి వ్రాసియుండుననియు తర్వాత యది పెరుగుచు వచ్చెననియు నతడు తలచెను.


బ్రహ్మాండ పురాణములో అధ్యాత్మ రామాయణము చేరియున్నది అందు వాల్మీకి మొదట గజదొంగగా నుండెననియు రామమంత్రోప దేశముచే మహాత్ముడయ్యెననియు వర్ణించినారు. ఈ పురాణము క్రీ. శ. 800 ఏండ్ల తర్వాతిదై యుండును. వాల్మీకి బోయ యనియు, దొంగ యనియు వర్ణించు కథలకంతయు నిదియే మూలమైయుండును. బ్రహ్మాండ పురాణ రచయితలు వాల్మీకి రామాయణములో లేని కల్పనలు చేసివేసిరి.


రామాయణములో “చక్రేప్రచేతసః పుత్రః” అనుటచేతను వాల్మీకికి ప్రాచేతసుడను పేరుండుట చేతను వాల్మీకి ప్రచేతసుని కుమారుడని తెలిసెను. వాల్మీకి "తపస్వి" అని "తపస్స్యాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం" అని రామాయణములోని మొట్ట మొదటి పంక్తియే తెలుపుచున్నది. వాల్మీకి తమసా నదీతీరమం దాశ్రమమును స్థాపించుకొని యుండెను. (బాల. 2-3) అతనికి శిష్యులుండిరి. (బాల. 2-1; 4) ఒక శిష్యుని పేరు భరద్వాజుడు (బాల. 1 - 5). వాల్మీకి బోయవాడను కథ కల్లయని యీ పంక్తి తెలుపుతున్నది. “మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ" (బాల 2-31) బ్రహ్మన్ అనిన బ్రహ్మ జ్ఞానము కలవాడనియు, బ్రాహ్మణుడనియు, పూజ్యుడనియు నర్థము లగును. వాల్మీకి ఋషిగా వర్ణితుడు. “రఘు వంశస్య చరితం చకార భగవాన్ ఋషిః” (బాల 3-9). 'భగవంతుడును ఋషియునునైన వాల్మీకి రఘు వంశ చరితమును వ్రాసెను' అని యన్నాడు. బాలకాండ మొదటి మూడు సర్గలలో వాల్మీకి తనకు తానే భగవాన్ ఋషిః, ఋషిపుంగవ, తపస్వి, మహాముని యనియు మహర్షి వ్రాసెను. ఋషి పుంగవు డిట్లనెను అనియు వ్రాసియుండునా? ఈ మూడు సర్గలన్య