Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి"

విజ్ఞాపన

సురవరం ప్రతాపరెడ్డి నామ సంస్మరణ మాత్రాన ఆనాటి తెలంగాణలోని సాంఘిక చైతన్యం గుర్తుకు వస్తుంది. గోలకొండ వ్రాతల ఫిరంగి మ్రోతలతో తెలుగు గుండెలలో వీరావేశం నింపిన ధీరుడాయన. పత్రికా సంపాదకుడుగా, పరిశోధక పండితుడుగా, సంస్థల ప్రోత్సాహకుడుగా, ఉత్తమాభిరుచిగల రచయితగా, విశాలాంధ్రోద్యమ ప్రేరకుడుగా సురవరంవారి కృషి సంస్తవనీయం. విశిష్టమైన శైలి, నిర్దిష్టమైన భావం ఆర్జవావేశం, విషయ వైభవం వారి రచనలలోని సహజ గుణాలు.

ప్రతాపరెడ్డిగారి ముద్రితాముద్రిత రచనలు సేకరించి వాటి ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాటైన సంస్థ “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి.” ఈ సంస్థలోని సభ్యులు :

             అధ్యక్షుడు :
             జస్టిస్ కొండా మాధవరెడ్డి
             ఉపాధ్యక్షుడు :
             శ్రీ దేవులపల్లి రామానుజరావు
             సభ్యులు :
             డా॥ సి. నారాయణ రెడ్డి
             డా॥ బి. రామరాజు
             డా॥ యం. రామారెడ్డి
             శ్రీ యస్. యన్. రెడ్డి
             డా॥ ఎల్లూరి శివారెడ్డి