Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

XXXIX

నామములు సదృశార్థములు. ఇంద్రోపేంద్రులకును గొంత సాదృశ్యము గలదు. ఈ యిద్దరితండ్రులపేర్లు భేదించినను తాతయగు బృహస్పతి యొక్కడే - బృహస్పతికొడుకు భరద్వాజుఁడనుట ప్రసిద్ధము. ఆది పర్వములోని ద్రోణజన్మకథయు నీ శల్యపర్వములోని శ్రుతావతికథయు తజ్జన్మవిషయమున నేకీభవించెడిని. కావున శ్రుతావతియే వేదవతియు భరద్వాజుడే కుశధ్వజుడునై యుందురని యూహించు నవకాశమున్నది.

3

భారత శల్యపర్వమునందలి యదేఘట్టములోనే ఋక్షగోలాం గూలములు జన్మ హేతువు చెప్పబడినది. తొల్లి యేక తద్వితత్రితులనంబడు గౌతమపుత్రులు తండ్రిమరణానంతరము బహుదేశములు సంచరించి త్రితుని పాండిత్యబలమునఁ బెక్కండ్రు రాజులవలన గోధనము నెంతేని యార్జించి తమయూరుచేరవచ్చుచుఁ దమలోఁ గనిష్ఠుఁడైన త్రితుని పేరు పెంపుల కసూయఁచెంది మార్గమధ్యమున నొక పాడుబావిలోఁ బడిపోవు నట్లు చేసిరట - ఆ త్రితుఁడు దైవానుగ్రహమునఁ గొంతకాలమునకుఁ బైకివచ్చి యన్నల దుండగమునకుఁ గోపించి వారి వంశజులు ఋక్షగోలాంగూలములై పోవునట్లు శపించెనట - ఇదే ప్రస్తావన మరల శాంతి పర్వములో నుపరిచరవసువుయొక్క వైష్ణవ యాగ సందర్భమునఁ జెప్పఁబడి యా యేకతద్వితుల సంతానమువారగు ఋక్షగోలాంగూలములే అనఁగా భల్లుక వానరములే శ్రీరామునికి రావణయుద్దమునఁ దోడ్పడినవని సైతము స్థిరపఱుపఁబడినది.

4

భారత శాంతిపర్వములో శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకుఁ జెప్పినట్లున్న పరశురామునికథలో మగథరాజైన బృహద్రథుఁడు (జరాసంధునితండ్రి) పరశురామభీతుఁడై పాఱిపోయి ఋక్షవత్పర్వతము