Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxii

కోసలదేశ జాత అనియుఁ గైకేయి యనఁగా గేకయ రాజపుత్రి లేక కేకయ దేశజాత అనియు మాత్రమే అర్థము కావున నవి విశేషణములే కాని విశేష్యరూపములైన నామధేయములుకావు. మహారామాయణకారున కింతకంటె నీ విషయ మధికముగాఁ దెలియదేమో. అతఁడును నంతేచేసి యున్నాడు. ఇట్టి సందర్భములలో మహాభారతమునకున్న ప్రత్యేకత రామాయణమునకు లేదనవచ్చును. అందుఁ గథానాయకుల విషయము ననేకాక నడుమవచ్చు నుపాఖ్యాన పాత్రల విషయమునఁగూడ నెన్నో విశేషములు గాన్పించుచున్నవి. ఉదా:- దమయంతి కొక పినతల్లి యున్నదట. ఆమె దశార్ణ దేశపు రాజు బిడ్డయట--

మనమింతవఱకును జర్చించిన ఈ ఆఖ్యానమునకంటె రామాయణకథ మహాభారతారణ్య పర్వములో నున్న రామోపాఖ్యానమున విస్తారముగానున్నది. అది రమారమి 700 శ్లోకములుగల యొక చిన్న ప్రత్యేక గ్రంథము. ప్రకృత మహారామాయణ మా రెంటి నాధారము చేసికొనియే యుత్పన్నమైనదని నమ్మవచ్చును.

మనము ప్రమాణముగా నమ్మవలసిన యాఖ్యానములో వెనుక మఱపున వ్రాయక విడిచిన మహర్షుల పేర్లు రాముని కాలనిర్ణయమున కవసరమైనవి. కనుక వానిని గొంత పరిశీలింతము.

1. భరద్వాజుఁడు


శ్లో. "చిత్రకూట మను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్”

శ్రీరాముడు చిత్రకూటము చేరుటకు ముందు భరద్వాజుని యానతిం బడసెనని పైదాని భావము.

2. వసిష్ఠ ప్రముఖులైన ద్విజులు

"మృతేతు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజై:
 నియుజ్యమానో రాజ్యాయ”