Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొమాయణ విశేషములు 887 ముగింపు వాల్మీకి రచితమైన శ్రీమద్రామాయణములో నాకు తోచిన విషయ ములు తెలుపుకొనినాను. ఇది చారిత్రిక విమర్శ. ఇట్టి విమర్శ పూర్వా చారాభిమానులకు సరిపడదని నేనెరుగుదును. కొందరికి ఆగ్రహము కూడా కలిగియుండును. కాని ఆగ్రహానుగ్రహములకు చారిత్రక విమర్శ లలో తావులేదు. ఎవరికేది సత్యమని తోచునో వారు దానిని గట్టిగా ప్రకటించుటలో తప్పుండదు. రామాయణమును గురించి వేదాంతపరము గాను వైష్ణవ సిద్ధాంతపరముగాను పలువురు సంస్కృతములోను దేశ భాషలలోను విపులముగా చర్చించినారు. కాని చారిత్రికముగా సమగ్ర ముగా తెనుగులో చర్చించినటులు నాకు కానరాలేదు. నేను రామాయణ మును చదివినప్పుడు నాకు స్ఫురించినవాటిని గుర్తు పెట్టుకొని యుంటిని. వాటినే యిందు వ్రాసితిని. నేను చేసిన చర్చలో, ఇచ్చిన అభిప్రాయములలో విశేష భాగము తప్పులుండవచ్చును. తప్పులు చేయనివారెవరు? వాటిని పండి తులు, విమర్శకులు, పరిశోధకులు, సయు క్తికముగా ఖండించవచ్చును. తప్పులుండిన సవరించుకొందును క్రొత్తసంగతులు తెలిపిన నేర్చు కొందును. శ్రీమద్రామాయణముపై నాకు అద్వితీయమైన ప్రేమ, భక్తి, కలవని అందలి కవితను అత్యుత్తమమైనదిగా భావించువాడనియు మనవిచేసుకొనుచు ఈ చర్చను పరిసమాప్తి చేయు మరొక మారు చున్నాను.