Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

రామాయణ విశేషములు

పౌరాణికు లింద్రుని తెచ్చి పెట్టుదురు. రాముడు అహల్యయొక్క ఆతిథ్య మును స్వీకరించితే ఆమె తప్పు మాసిపోవునని చెప్పిరి. దీనివలన ఆ కాలములో పాతివ్రత్యమహిమ ఇంకను వికాసము పొందలేదని ఊహింప వచ్చును."[1]

“రాముని సమకాలికుడు భీమసాత్వతుడు. భీమసాత్వతునికి 12 తరములతర్వాత శ్రీకృష్ణుడు పుట్టెను. విదురథుడు దశరథుని సమకాలి కుడు. విదురథుని వంశములో 16 వ తరములో అర్జునుడు పుట్టెను. రోమపాదుడు అంగరాజు. దశరథుని సమకాలికుడు. అతనికి 12 వ తరములోని అంగరాజుకు కర్ణుడు దత్తుడయ్యెను. కావున మహాభారత కాలము కంటే 15 తరముల ముందు కాలములో దశరథుడుండెను. వాజినేయ భరద్వాజుడు రామునికాలపు ఋషి. అతడే ఋగ్వేదములో గోహత్య నిషేధించినవాడు (ఋ. 6,28,4), వల్మీక భార్గవుని కుమారుడు ఋక్ష అనువాడు. అతడే వాల్మీకి.”[2]

“మహాభారతకాలము 1150 క్రీ. పూర్వము దివోదాసుడు, దశ రథుడు అంతకంటే 13 తరాలకు ముందుండిన వారు. తరమునకు 28 ఏండ్లచొప్పున గుణించినచో రామాయణకాలము క్రీ. పూ. 1514 అని తేలును రావణుని చంపినప్పుడు రాముని వయస్సు 42 ఏండ్లు కావున లంకాయుద్ధము క్రీ. పూ. 1450 లో జరిగెను. నలచక్రవర్తి క్రీ. పూ.

1575 లో నుండెను.”[3]

  1. S. N. Pradhan. Chron of Anc. India.
  2. S. N. Pradhan. Chron of Anc. India.
  3. S. N. Pradhan. Chron of Anc. India.