Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 277 అహురులు. జరథుస్త్రుడే భృగువని మూడవ ప్రకరణములో తెలిపినాను. శుక్రుడు భార్గవుడు. కావున అసురగురు వయ్యెను. రాక్షసులు మాయావులని పౌరాణికుల అభిప్రాయము. శుక్రుడు అసురులను బ్రదికించు క్రియల నెరిగియుండెనని వర్ణించినారు. 'యాతు' అనునది రాక్షసులు పర్యాయపదము. యాతు అనిన కర్మనాశకుడు అనియు పీడ అనియు అర్థము చెప్పుదురు. సాయణాచార్యులు రాక్షసుడు అని అర్థము చేసిరి. పార్సీభాషలో ఒక పదమిప్పటికినీ నిలిచియున్నది. అది 'జాదూ' అను పదము. మాయ లేక గారడి అని యర్థములో వాడుదురు. యకారము జకారముగా తకారము దకారముగా మారును. యాతుపదమే జాదూ అయియుండును. ఈ చర్చనుబట్టి అసురాది జాతులవారందరు ఒక్క రాక్షసులు మాత్రమే కారనియు, వారందరు వేర్వేరు జాతులవారనియు నా యభిప్రాయము. రాక్షసుల నాగరకత మరల మొదటికి వచ్చుచున్నాను. వింధ్యకు దక్షిణభాగములో రావణపాలితులై యుండిన రాక్షసులు పనికిరానివారు కారు. ఆర్యులకు ప్రబలప్రతిస్పర్ధులు. గొప్ప నాగరికత పొందినవారు. వారి నగరము, నగరములోని సౌధములు, సౌధములలోని సుందరాంగులు, సుంద రాంగులు నేర్చిన నాట్య సంగీత చిత్రకళలు, వారి యానందము లు- ఇవన్నియు వారి నాగరకతను బాగా సూచించుచున్నవి. రావణుడంతటి దుష్టకాముకుడయ్యును సీత నెత్తుకొని పోయిన తర్వాత ఆమె యంగీకార మెందుకు కోరుచుండెను? అతనికి వేదవతియొక్క శాపముండేవని ఉత్తర కాండలో తెలిపినారు. అది ప్రమాణము కాదు. నిజమైన విషయమేమన రావణుడు సీతకు సమ్మతించుటకు ఒక సంవత్సరము గడువిచ్చెను అటు తర్వాత ఆమె ఒప్పుకొననిచో ఆమెను బలాత్కరింతునని తెలిపెను.