Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

రామాయణ విశేషములు

రక్షోవర్గమువారు "దైత్యుల ముఖ్యనగరము హిరణ్యపురమని మన పురాణాలు చెప్పెను. అదే యిప్పటి హిర్కేనియా (Hyrcania). ఆ ప్రాంతమందే కాస్పియా దేశముకలదు అచ్చటనే హిరణ్య కశిపు, హిరణ్యాక్షులు రాజ్యము చేసిరి":[1]

నాగులు మనచర్చకు సంబంధించకున్నను వారెవరో తెలిపి యీ చర్చముగింతును. వారు హూణులని తెలిపినాను. నందలాల్‌దేగారిట్లు వ్రాసినారు: “సంస్కృతభాషలో సర్పములకిచ్చిన పర్యాయపదములలో హూణులలోని వివిధజాతుల పేరులు సరిపోలుచున్నవి. హింగ్ నూ (Hiung nu) అనునది హూణులపేరు. దానినుండి నాగశబ్దము వచ్చినది. సర్ప అనునది సర్తస్ప జాతిపదము. ఉరగ ఊగురుస్ (Uigurs) జాతి పదము. పర్ని, నాగాయ అను రెండు శకజాతులు జక్సార్టీసు నదీ ప్రాంతాలలో నివసించుచుండిరి. ఆ రెండు జాతుల పదమే పన్నగ అయినది. అజి పదమే అహియైనది. ఫణి యనునది ఫనికియాలోని ఫనికుల నుండి ఏర్పడెను"[2] హూణులకు మొదటిపేరు తలె (Tele) రసా-తల, అ-తల, కు-తల మున్నగు పేరులు దీనినుండియే వచ్చెను.”[3] సుగ్రీవుడు పశ్చిమదిగ్భాగ మందలి దేశములను తెలుపునప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో అపర తాలపర్వత మున్నదనెను. ఈ పదము తాల (లేక హూణుల) జాతిని సూచించునేమో !

రాక్షసుల పర్యాయపదములను చెప్పుచు అమరసింహుడు వారిని శుక్రశిష్యులని ప్రత్యేకముగా తెలిపియున్నాడు. శుక్రుడు రాక్షసులకు

కాదుకాని అసురులకు గురువు. అసురులే జరథుస్త్రమతములోని

  1. రసాతల పుట. 31-32.
  2. రసాతల పుట. 51.
  3. రసాతల పుట. 9.