274
రామాయణ విశేషములు
వేరుజాతిగా కానవచ్చుచున్నారు. హీబ్రూ భాషలోని బైబిల్‌లో యాఫ్త్ (Yaphth) అను వాడుండెనని తెలిపినారు. అతడే మన 'యాతు' అయి యుండును. అతని సంతతివారే యాతుధానులై యుందురని ఊహించు చున్నాను.
"యః పౌరుషేణ క్రవిషాసం దుక్తేయో అశ్వ్యేన పశునా
యాతుధానః" (ఋగ్వేదము 10-87-16)
యాతుధానులు మనుష్యులను చంపుకొని తినువారనియు గుర్ర
ముల మాంసమును తినువారనియు పై మంత్రము తెలుపుచున్నది.
శకజాతి వారిలో మధ్య ఏషియా తురానీలు, తార్తారులు, హీబ్రూలు,
అరబ్బులు చేరినవారే! పూర్వము శకజాతివారు మనుష్యులను
తినెడివారు. “వారు గుర్రము మాంసము తిని, గుర్రము పాలు త్రాగుచుం
డిరి” అని అసీరియా చరిత్రలో రగోజిన్ గారు వ్రాసిరి. "సితియనులు
(శకులు) మహా క్రూరులు, ఓడిన శత్రువులను చంపి వండి విందు చేసు
కొనుచుండిరి” అని మావర్ (Mavor)(Universal History 1812 A.D)
తన ప్రపంచ చరిత్రలో వ్రాసెను. కావున శకజాతి భేదమే యాతుధాన
వర్గమనుట స్పష్టము.
రామాయణమందలి రాక్షసులు, దానవ, దైత్యాసుర, కిమ్మీర యాతుధాన పుణ్యజన నైరృతాది వర్గాలవారు కారు. వారు కృష్ణా గోదావరీ ముఖ ద్వారముల మధ్య ప్రదేశమందుండినవారని నా యభిప్రా యము. జనస్థానము సవరల 'జైతాన్' అనుటయే సమంజసము. జనస్థానము నుండి ఖరదూషణులు విపులసైన్యముతో రాము నెదుర్కొ నుటచేత వారు పంచవటికి సమీపమున నుండియుండవలెను. వారు సముద్రము దాటివచ్చి దాడిచేసినట్లు రామాయణము చెప్పలేదు. బౌద్ధ మత గ్రంథమగు సుత్తనిపాతములో అశ్మకదేశము గోదారీతీరమున