రామాయణ విశేషములు
275
నుండినట్లును 'మహాజనపదము' అందుండినట్లును తెలిపినారు. బౌద్ధ కాలమందును గోదావరీ ప్రాంతములందు జనస్థానముండినట్లు తెలుపుట చేత రామాయణ జనస్థానము జాడ స్పష్టమైనది గోదావరి సముద్రమునకు సమీపమందుండిన ప్రాంతమంతయు జనస్థానమనియు, గోదావరి లంకలలోనే లంక యుండెననియు నిర్ణయించుకొనిన యథార్థమునకు సమీపములో నున్నామనుకొనవలయును. ఇక 'నాగులు' మిగిలినారు . వారు మన రామాయణములో రాలేదు. మహాభారతము వారి కథతోనే ప్రారంభమగుచున్నది. అనగా అప్పటికి వారు కనిపించుచున్నారు. వారు హూణులలోని తెగవారు.
ఇచ్చటనే మరొక విషయము వ్రాయవలసియున్నది. దైత్యులు దితిసుతులని అమరసింహుడు వర్ణించెనని చెప్పినాను. దైత్య శబ్దమునకు వ్యుత్పత్తి కల్పించినాడు అమరుడు. కాని 'దైత్య' అనునదే మూల శబ్దము. దానిని విభజించి సమాసముగా చేయరాదు. మీడియాను ఆర్మి నియా నుండి వేరుపఱచునట్టి ఆరాస్ (Aras) నదిని పూర్వము దైత్య నది యని వ్యవహరించిరి. పార్సీల వేండీదాద్ అను పవిత్ర గ్రంథములో నిట్లున్నది : "అహురమజ్దాను అయిన నేను మంచి యుత్తమ దేశమగు ఐర్యాణ వీజ(Airyana Vaeja) అను దేశమును మొట్టమొదట సృజించినాను. అది దైత్య నదీ సమీపమందుకలదు”[1]. ఆరాన్ నదిని అరక్షస్ (Araxes) అనియు వ్యవహరించిరి. కావున ప్రాచీనమందు-అరక్షస్ అనగా - దైత్య
నదీ ప్రాంత జనులను దైత్యులనిరి. వారే అరక్షస్సులు అనగా
- ↑ రసాతల--పుట. 4. (ఇచ్చట ఐర్యాణ వీజ అనునది నేనింతకుముందు 8వ ప్రకరణములో చూపిన ఆర్యాణదేశము. ఆహురమజ్దాను ఋగ్వేదములో 'అసురమేధాః' ఆని పేర్కొనినారు. దైత్యులు పూర్వదేవతలు, ఆ నదివద్దనే దేవతల ఆర్యావర్తముండుట గమనింపదగినది.)