Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxx


ఇట్లు మహారామాయణమునందలి 5 కాండములకు మాత్రమే మూలమున్నది తక్కిన 90వ శ్లోకము మొదలు 100 వ శ్లోకమువఱకునుగల 11 శ్లోకములు ఫలశ్రుతి విషయములు.

ఇట్లు చూచిన మహారామాయణము నందలి బాలకాండమంతయు నమూలమనక తప్పదు. రాముని వనవాసారంభ సందర్భమున “రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా జనకస్య కులేజాతా దేవమా యేవ నిర్మితా" అనియున్న శ్లోకమున నొక కృత్రిమ వ్యాఖ్యానరూపమే మహారామాయణము నందలి సీతాజన్మ వృత్తాంతము. “జనకస్య కులే” అనఁగా జనక గృహమునందు అని యర్థముచేసి అది యజ్ఞశాలగా గల్పించి 'సీతాలాంగల పద్ధతిః' అను నిఘంటువున కనురూపముగా మహారామాయణకర్త సీతాజన్మ వృత్తాంతమును బెంచియున్నాడు. నిజములో కుల శబ్దమున కిచ్చట వంశమనిమాత్రమె యర్థము. సీతా శబ్దము మైథిలుల ప్రియవస్తువిషయముగా వచ్చును. “దేవమాయేవ నిర్మితా" అను దానికి "అమృతమథనానంతర మసురమోహనార్థం నిర్మితా విష్ణు మాయేవస్థితా" అని గోవిందరాజులు వ్యాఖ్యానించి కడకు “అనేన సౌందర్య పరాకాష్ఠోక్తా” అని సిద్ధాంతీకరించియున్నాడు.

“అమృతమథనము పిమ్మట ఆసురులను భ్రమింపఁజేయుటకై నిర్మింపఁబడిన ఆ విష్ణుమాయవలె నున్నది" అని వ్యాఖ్యానార్థము. “దీనిచేత సీతయొక్క సౌందర్యాతిశయము చెప్పఁబడినది" అని యాతని సిద్ధాంతము. ఈ నిర్ణయమే సరియైనది. "జనకస్య కులేజాతా” అనుటలో నామె వంశోన్నతి చెప్పఁబడినదని గోవింద రాజుల నిర్ణయము. కనుక జనకుని యజ్ఞ శాలలో భూమి దున్నునప్పుడు లేచివచ్చినదను కల్పన చాతురీమాత్రమని మనము తలంపవచ్చును.

హనుమంతునికిని సుగ్రీవునకును మాత్రమే యిందు వానరశబ్దము విశేషణముగా నీయఁబడినది. వాలి వానర రాజనిమాత్రము పలుమాఱుఁ