Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxix

1

“ఇక్ష్వాకువంశప్రభవో రామోనామా" అను శ్లోకము మొదలు “దండకాన్ ప్రవివేశహ" అను శ్లోకమువఱకునుగల (8 మొదలు 40 వఱకు) 33 శ్లోకములు మహారామాయణమునందలి యయోధ్యకాండకు మూలభూతములు. వీనికిఁ బూర్వమున్న 7 శ్లోకములు కథావతారికామాత్ర ప్రయోజనములు.

2

"ప్రవిశ్యతు మహారణ్యం" అను 41 వ శ్లోకము మొదలు "శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః" అను 57½ శ్లోకమువఱకునుగల 17½ శ్లోకములు అరణ్యకాండమునకు మూల భూతములు.

3

“పంపాతీరే హనుమతా సంగతో” అను 58 వ శ్లోకము మొదలు “తతో గృధ్రస్యవచనా త్సంపాతేర్హనుమాన్ బలీ" అను 71 వ శ్లోకము వఱకును 14 శ్లో. కిష్కింధాకాండ విషయములు.

4

“శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం" అను 72 వ శ్లోకము మొదలు "సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం" అను 78 వ శ్లోకమువఱకును గల 7 శ్లోకములు సుందరకాండ విషయములు.

5

"న్యవేదయ దమేయాత్మా కృత్వా రామం ప్రదక్షిణం" అను 79 వ శ్లోకము మొదలు "రామ స్సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్" అను 89 వ శ్లోకమువఱకును గల 11 శ్లోకములు యుద్ధకాండ విషయములు.