Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

261

అయితే యీ జక్కు అను పదమైనను ఎట్లేర్పడెను? తెనుగు వాఙ్మయములో జక్కులవారిని కొందరు కవులు వర్ణించినారు. దాన్ని బట్టి జక్కులు శ క్తిని, శివుని పూజించువారని యర్థమగును. శివునికి 'జక్కుల రేడు' అని పేరుకూడ కలదు. జక్కులపూర్వచరిత్ర మన కేమియు తెలియుటలేదు. అనార్యసంఘములగు అసుర, పిశాచవర్గాలలో నుదాహృ తులగుటచేత జక్కులు లేక యక్షులు అనార్యజాతివారనుటలో సందే హములేదు. అయితే వీరు హిందూస్థానమున నుండిన అనార్యులా లేక ఈరాన్, చీనా ప్రాంతాలలో నుండిన అనార్యులా అనునది విచారింప వలసియుండును. అసుర, పిశాచ, గాంధర్వ, దైత్య, దానవ, కిన్న రాది వర్గాలన్నియు హిందూస్థానములో కాక దాని కుత్తరపశ్చిమ దేశాలలో నుండిన అనార్య జాతులగుటచేత వాటితో సహా పఠింపబడిన యక్షులు కూడా బయటివారేయని తలచిన పొరపాటుగా నుండనేరదు. ఇట్టిజాతి యొకటుండుటచేత మన పురాణాలలో వర్ణితమైనది. కాని యద్కెడి జాతియో పురాణాలను అడ్డదిడ్డిగా పెంచిన వారికిమాత్రము తెలియదు. అందుచేత వారిని 'దేవయోనుల'లో జమకట్టిరి.

పూర్వము యక్షులను ప్రత్యేక మానవజాతి యొకటుండెను. 'దేవయోనుల' పుట్టుపూర్వోత్తరాలకై మనము టిబెట్టు, చీనా, ఈరాన్, అసీరియా, ఫణికియా, ఫ్రిజియా, తార్తరీ, బాబిలోనియా, హట్టి(హిట్టైట్) ఖశ (కస్సైట్), ఆర్మీనియా, మీడియా, దేశాలలో వెదకినచో అవన్నియు సులభముగా వెల్లడికాగలవు.

క్రీస్తుశకమునకు పూర్వము నాలుగైదునూర్ల యేండ్ల నుండి తచ్ఛ కారంభమువరకు యఛీ (yuchi) అను జాతి హూణజాతితో సమానముగా ప్రబలమైన జాతిగా నుండెను. అది చీనాదేశచరిత్రలో పై కాలమందు ముఖ్యపాత్ర వహించెను. ఈ యఛీజాతి హూణులవలె మధ్యఏషియాలోని తార్తరీజాతివారు. హూణులతో యుద్ధాలు చేసినవారు. వీరు క్రీ.పూ. 165