260
రామాయణ విశేషములు
అమరసింహుడిచ్చిన ఆ శబ్దములపట్టిక నుదాహరించినాను. అమరసింహు డిచ్చిన ఆ శబ్దములపట్టికలో శుక్రశిష్య, రాత్రించర, సురారి, పూర్వదేవ వంటి గుణవాచకములను వదలివేయగా మిగిలినజాతులివి: 1. విద్యాధర, 2. ఆప్సర, 3. యక్ష, 4. రాక్షస, 5. కిన్నర, 6. పిశాచ, 7. గుహ్యక, 8. సిద్ధ, 9. భూత, 10. అసుర, 11. దసుజ, 12. కర్బుర, 13. యాతు, 14. పుణ్యజన, 15. నైరృత.
ఈ విధముగా మనకు ఇంచుమించు 15 విధములైన అనార్య జాతులవారు కనిపించుచున్నారు. అయితే వీరితో పాటు మనము ఇంకా కొందరిని చేర్చవలెను. వారు (1) నాగులు (2) కిర్మీరులు. ఈ లెక్క చొప్పున 17 జాతులవారు ఏర్పడుచున్నారు. అమరసింహుడు చూపిన పర్యాయపదాలలో దైత్య, దైతేయ, దితిసుత అనునవి దానవులకు వర్తించును. దానవ, దనుజ రెండును ఒకటే. అందుచేత ఇవన్నింటికిని దనుజ అను పదమొక్కటే గ్రహించినాను. పూర్వదేవ, సురద్విష అనునవి అసురశబ్దవాచ్యములే. కోణపక్రవ్యాత్, క్రవ్యాద, ఆస్రప అనునవి వారి మాంసభుక్తిని సూచించును. పచ్చిమాంసము తినేవారని అట్లు నిర్దేశించియుందురు. శుక్ర శిష్యులని అసురులు ప్రఖ్యాతులు. ఇక ఈ 17 జాతులను గురించి విచారింతము. వీరిలో విద్యాధరులు, అప్స రలు, యక్షులు, పిశాచులు, గుహ్యకసిద్ధులు, భూతములు మన చర్చకు సంబంధించినవారు కారు. వారు హిందూస్థానములో నుండిన ఆదిమ నివాసులే. విద్యాధర గంధర్వులు గాంధారదేశమువారు. పిశాచులు పైశాచీ ప్రాకృతమును మాట్లాడుచుండిన యీ దేశవాసులు. సిద్ధులును భూతములును వారి భేదముగానే కానవచ్చుచున్నారు. భూతములు తిబ్బెట్ (త్రివిష్టప) దేశములోనివారైయుందురు. దాని సరిహద్దులో హిందూస్థా నోత్తరభాగము భూతాన్ దేశము కలదు. భూతాన్ వారినిభోటులనిరి. వారినే భూతములని పౌరాణికులు భావించియుందురు. యక్షులు జక్కుల వారని తెలిపినాను,