Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiii


సీతారాముల చరిత్రములను గూర్చి యీ క్రింది గ్రంథములలోఁ గలదు. అందు భిన్నరూపగాథలును గలవు.

1. పూర్వధర్మఖండము 2. ఉత్తరధర్మఖండము 3. పద్మపురాణము 4. రామతాపన్యుపనిషత్తు 5. హిరణ్యగర్భసంహిత 6. ఉమాగస్త్యసంహిత 7. భాగవతము 8. అధ్యాత్మరామాయణము 9. భారతము 10. విష్ణుపురాణము 11. కూర్మపురాణము 12. శేషధర్మము 18. బ్రహ్మపురాణము 14. స్కాందపురాణము 15. మత్స్యపురాణము 16. గరుడపురాణము 17. విష్ణుయామిళము 18. మోక్షఖండము 19. తత్వసంగ్రహ రామాయణము.

పై గ్రంథములలో స్మార్తులు రాముని అద్వైత పరబ్రహ్మము గాను వైష్ణవులు విష్ణురూపునిగాను మాధ్వులు ద్వైత మతానుసారినిగాను నిరూపించుచు తత్తన్మతానుసారులకు బాహ్యచిహ్నములను జిత్రించి తమ వానినిగా జేసుకొని యారాధించుచున్నారు. ఈ నడుమ నొక మహాపండితుడు రాముని లలితావతారునిగా నిరూపించి శక్తిస్వరూపునిగా రామాయణమునకు వ్యాఖ్యానము రచించియున్నాడు. వాల్మీకి రామాయణమునకు పై మతముల ననుసరించి బహువిధ వ్యాఖ్యానములు గలవు. ఇప్పటికి 30 యేండ్లకుముందు కీ. శే. బొబ్బిలి మహారాజాగారు రామాయణముపైని భారతముపైని చిన్న విమర్శన గ్రంథములను వ్రాసి యున్నారు. ఆ గ్రంథములు పండితులచేఁ బరిష్కృతములే. అందుఁ గొన్ని యంశములు శ్రీ రెడ్డిగారి గ్రంథాంశమునకు సరిపడియేయున్నవి. కాని అంతకంటె నిది సమగ్రమైనది. ఇంకొక మనవి యేమనగా:-

శ్రీ రెడ్డిగారు వ్రాసిన విభూతిలోని రామాయణ వ్యాసములపై నిప్పటికే పెక్కండ్రు విరుద్దాభిప్రాయముల నిచ్చియున్నారట పీఠిక కూడ వారి ఖండనములకు గురియగుటలో విరుద్ధములేదు. నేను భారత