Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 కైకేయి రామాయణ విశేషములు మొదట మొదట స్వార్థము లేనట్టిది. కాని మంథర ఆమెకు దుర్బో ధలు బాగానూరిపోయగా పోయగా ఆమెలో పూర్తిగా మార్పుకలిగెను. అటు తర్వాతఎవరేమనినాసరే ఆమె అచంచల యయ్యెను. రాజ్యమంతయును తిట్టిపోసెను. దశరథుడు చావనేచచ్చెను. అప్పటికినీ ఆమెకు మనస్తాపము కలుగలేదు. ప్రాయశ్చిత్తమన్న మాటలేదు. ఆమె పారసీక దేశపు స్త్రీయని తెలిపినాను. ఆమె చెలిక త్తె మంథరకూడా అక్కడిదిగానే కనబడుచున్నది. అందుచేతనే దాని నిట్లు వర్ణించినారు. చెలికత్తె “జ్ఞాతిదాసీ యతోజాతా, కైకేయ్యాస్తు సహోషిలా" (అయో. 7-1) పుట్టింటివారిచే అరణముగా నియ్యబడినట్టిది; ఎక్కడనో పుట్టి నట్టిది; కై కేయివెంట పంపబడి ఆమెదగ్గరనే సదా ఉండునట్టిది అని వర్ణించుటచే కై కేయియొక్క యు మంంకర యొక్కయు వైదేశికత మరింత స్పష్టమగుచున్నది. పైగా మథర "కుబ్జ”. పర్షియాలోకూడ పూర్వ కాలమందు రాజులు తమ అంతఃపురాలవద్ద నపుంసకులను, గూని స్త్రీలను కాపలాగా ఉంచుచుండినట్లు ప్రతీతి. కైకేయి తల్లిదండ్రులున్నూ కఠినులని తెలిపినారు. వారిజాడయే బిడ్డకును పట్టువడినది. అయినను భరతుని కన్నందున ఆమెను రాక్ష సిగా లోకము తలపజాలక పోయినది. సీత మహాపతివ్రత. ఆమె పేరు భారతీయ స్త్రీలకు ఉత్తమోత్తమ మంత్రరాజము. హిందూ స్త్రీలకు రామునకంటే సీత యెక్కువ ప్రీతిపాత్ర. పతిభక్తి ఆమెలో అచంచలము. రావణుని సామ్రాజ్యము, 5000 దాసీ జనుల సమర్పణము, రావణుడే స్వయముగా దాసుడై యుండుమాట,